Catch outs : అంతర్జాతీయ T20 క్రికెట్లో టీమిండియా అరుదైన ఘనత సాధించింది. ఒక ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టులోని 10 మంది బ్యాటర్లను కేవలం క్యాచ్ అవుట్ల రూపంలో మాత్రమే పెవిలియన్‌కు పంపింది. క్లీన్ బౌల్డ్, ఎల్బీడబ్ల్యూ, రనౌట్లు ఒక్కటి కూడా లేవు. T20 వరల్డ్‌కప్‌లో ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో భారత్ ఈ ఘనత దక్కించుకుంది. అంతర్జాతీయ T20 క్రికెట్ చరిత్రలోనే ఇంతవరకు ఏ జట్టు కూడా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను కేవలం క్యాచ్అవుట్ల రూపంలో పెవిలియన్‌కు పంపలేదు.
గురువారం రాత్రి భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో భారత్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 182 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఫ్ఘనిస్థాన్ 134 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆఫ్ఘన్ బ్యాటర్లందరూ క్యాచ్ అవుట్ల రూపంలోనే వెనుదిరిగారు. జడేజా మూడు క్యాచ్‌లు, రిషబ్ పంత్ మూడు క్యాచ్‌లు, రోహిత్ శర్మ రెండు క్యాచ్‌లు, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో క్యాచ్ అందుకున్నారు.
బుమ్రా బౌలింగ్‌లో అజ్రతుల్లా జజాయ్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో మహ్మద్ నబీ, అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్ ఇచ్చిన క్యాచ్‌లను రవీంద్ర జడేజా అందుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌లో రహమానుల్లా గుర్బాజ్‌ను, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో గుల్బదీన్ నాయిబ్ను, అర్షదీప్‌సింగ్ బౌలింగ్‌లో నవీన్ ఉల్ హక్‌ను రిషబ్ పంత్ క్యాచ్ అవుట్ చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఇబ్రహీమ్ జర్డాన్, అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో నూర్ అహ్మద్ ఇచ్చిన క్యాచ్‌లను రోహిత్ శర్మ పట్టాడు.
జడేజా బౌలింగ్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్ ఇచ్చిన క్యాచ్‌ను అక్షర్ పటేల్, బుమ్రా బౌలింగ్‌లో నజీబుల్లా జర్డాన్ ఇచ్చిన క్యాచ్‌ను అర్షదీప్ సింగ్ అందుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా మూడు, అర్షదీప్ సింగ్ మూడు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా.. జడేజా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు.