Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్‌లో రజతం కోసం పోరాడుతున్న భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ (Vinesh Phogat)కు మళ్లీ నిరాశే ఎదురైంది. సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న వినేశ్ అప్పీల్‌పై తీర్పును అర్బిట్రేషన్ కోర్టు (CAS) మళ్లీ వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం రాత్రి 9:30 గంటలకు తీర్పు ఇవ్వాలి. కానీ, ఆగస్టు 16 శుక్రవారం సాయంత్రం లోపు ఏదో ఒకటి తేల్చేస్తామని సీఏఎస్ ఏదో ఒకటి చెప్తామని తెలిపింది. దాంతో, మరో వినేశ్తో పాటు యావత్ భారతం సిల్వర్ మెడల్ వస్తుందా? లేదా? అని మూడు రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
‘వినేశ్ ఫోగాట్ అప్పీల్‌పై తీర్పును మరో మూడు రోజలకు వాయిదా వేయడానికి కారణాన్ని కూడా సీఏఎస్ వెల్లడించింది. ఒలింపిక్ గేమ్స్ సీఏఎస్ అర్బిట్రేషన్ నియమాల్లోని ఆర్టికల్ 18 ప్రకారం తీర్పును సీఏఎస్ అడ్ హక్ డివిజన్ అధ్యక్షుడు వాయిదా వేశారు. ఆగస్టు 16 సాయంత్రం 6 గంటలలోపు తీర్పు చెప్పాలని తీర్మానించారు’ అని సీఏఎస్ అడ్ హక్ డివిజన్ ఓ ప్రకటనలో తెలిపింది.
పారిస్ ఒలింపిక్స్‌లో 50 కిలోల విభాగంలో వినేశ్ ఫొగాట్ అంచనాలు అందుకుంటూ ఫైనల్ చేరింది. ఆగస్టు 7 బుధవారం ఉదయం అమెరికా రెజ్లర్ సరాహ్ హిల్డెబ్రాండ్త్తో పసిడి ఫైట్ కాసేపట్లో ఉందనగా నిర్వాహకులు ఆమె బరువు కొలిచారు. అయితే.. 100 గ్రాముల అదనపు బరువు ఉండడంతో వినేశ్‌ను నిర్వాహకులు అనర్హురాలిగా ప్రకటించారు.
దాంతో,ఫైనల్ ఆడలేకపోయిన ఆమె అప్పీల్‌పై అర్బిట్రేషన్ కోర్టు (CAS)ను ఆశ్రయించింది. విశ్వ క్రీడల్లో విశేషంగా రాణించిన వినేశ్ ఫోగాట్‌కు గోల్డ్ మెడల్ ఇస్తామని హర్యానాకు చెందని ఖాప్ పంచాయతీ (Khap Panchayat) ప్రకటించింది.