Magnus Carlson : ఇటీవల కాలంలో భారత కుర్రాళ్లు చదరంగంలో అబ్బురపరిచే విజయాలతో ఔరా అనిపిస్తున్నారు. వేదిక ఏదైనా తమదైన ప్రతిభతో మేటి ఆటగాళ్లను సైతం ఓడిస్తున్నారు. వరల్డ్ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ (Magnus Carlson) సైతం అమ్మో భారత కుర్రాళ్లతో తలపడడం కష్టమేనని అంటున్నాడు. ఫిడే వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్షిప్ (FIDE World Rapid and Blitz Championship)ను పురస్కరించుకొని మాట్లాడిన ఈ నార్వే లెజెండ్ మాజీ ఛాంపియన్ డి.గుకేశ్(D.Gukesh)తో ఆడడం ఎల్లప్పుడూ సవాల్‌గానే ఉంటుందని అన్నాడు.
దోహాలోని ఖతార్‌లో జరుగుతున్న ఫిడే వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో కార్ల్సన్ ఫేవరెట్‌గా ఆడుతున్నాడు. ఈ టోర్నీలో జూనియర్ల నుంచి తనకు గట్టి పోటీ ఎదురుకానుందని చెబుతున్న అతడు భారత కుర్రాడు గుకేశ్‌తో ముప్పేనని అంటున్నాడు. గత కొన్ని రోజులుగా నేను యంగ్‌స్టర్స్‌తో మ్యాచ్‌లు ఆడలేదు. వారు ఈ మధ్య చాలా గొప్పగా ఆడుతున్నారు. ముఖ్యంగా డి.గుకేశ్ అదరగొడుతున్నాడు. 16 నుంచి 22 ఏళ్లున్న యువకెరటాలతో ప్రమాదం పొంచి ఉంటుంది అని కార్ల్సన్ తెలిపాడు.
FIDE World Rapid & Blitz Championships 2025 – Opening Press Conference ✅
The event is taking place in Doha from December 26 to 30, and features a total prize fund of more than €1,000,000 across the Open and Women’s competitions. The Open Rapid Championship includes 251… pic.twitter.com/caRZi4Sceo
— International Chess Federation (@FIDE_chess) December 25, 2025
ఈ ఏడాది నార్వే చెస్ (Norway Chess)లో గుకేశ్ వ్యూహాలకు బదులివ్వలేక కార్ల్సన్ చేతులెత్తేశాడు. వరల్డ్ నంబర్1ను ఓడించి వార్తల్లో నిలిచాడు భారత గ్రాండ్‌మాస్టర్. అయినా సరే గుకేశ్‌ను తాను గ్రేట్ ప్లేయర్‌గా కాకుండా యంగ్స్టర్గానే చూస్తానని అంటున్నాడీ చెస్ కింగ్. ఈ మధ్య స్వదేశంలో ముగిసిన చెస్ వరల్డ్‌కప్‌లో నిరాశపరిచిన గుకేశ్ .. ఫిడే వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో కార్ల్‌సన్‌కు చెక్ పెట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. అతడితో పాటు అర్జున్ ఎరిగేసి, ప్రజ్ఞానంద.. కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలు సత్తా చాటాలనుకుంటున్నారు. ఈ టోర్నీ డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 30 వరకు జరుగనుంది.