స్టావెంజర్: ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ .. నార్వే చెస్(Norway Chess) టైటిల్‌ను ఏడోసారి గెలుచుకున్నాడు. ఆఖరి గేమ్‌లో ఇండియన్ గ్రాండ్‌మాస్టర్ తడబడ్డాడు. అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువనాతో జరిగిన గేమ్‌లో గుకేశ్ ఓడిపోయాడు. తుది రౌండ్లో కీలకమైన మూడు పాయింట్లను చేజార్చుకున్నాడు. 2018 నార్వే చెస్ చాంపియన్ కరువనా ఆఖరి రౌండ్లో గట్టి పోటీ ఇచ్చాడు. భారతీయ చెస్ స్టార్ గుకేశ్‌కు సమయం లేకుండాపోయింది. టైం కన్నా ముందే ప్రత్యర్థికి షేక్‌హ్యాండ్ ఇచ్చి ఓటమిని అంగీకరించాడు.
The 2025 Norway Chess CHAMPION: MAGNUS CARLSEN 🏆#NorwayChess pic.twitter.com/wyYhBeAh4m
— Norway Chess (@NorwayChess) June 6, 2025
మాజీ చాంపియన్ కార్ల్సన్.. టోర్నీలో 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. తుది రౌండ్లో భారతీయ ప్లేయర్ అర్జున్ ఎరిగైసితో ఆడిన గేమ్‌లో అతను డ్రా చేసుకున్నాడు. టోర్నమెంట్లో కరువనా 15.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. గుకేశ్ మూడో స్థానంలో నిలిచాడు. అతను 14.5 పాయింట్లు సాధించాడు. 12.5 పాయింట్లతో అర్జున్ అయిదో స్థానంలో ఉన్నాడు.
మహిళల విభాగంగా వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్ రెండు సార్లు గెలిచిన ఉక్రెయిన్ క్రీడాకారిణి అన్నా ముజిచుక్.. నార్వే చెస్ టైటిల్‌ను నెగ్గింది. ఆమెకు టోర్నీలో 16.5 పాయింట్లు వచ్చాయి. తుది రౌండ్లో భారతీయ క్రీడాకారిణి ఆర్. వైశాలి గట్టి పోటీ ఇచ్చినా ఆ గేమ్‌ను ఉక్రెయిన్ స్టార్ డ్రా చేసుకున్నది. భారతీయ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తన తుది రౌండ్ గేమ్‌లో డ్రా చేసుకున్నది. ఆ గేమ్‌లో 1.5 పాయింట్లు సాధించి.. టోర్నీలో 15 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
Congratulations @annamuzychuk90 👏👏#NorwayChess pic.twitter.com/VvCoAXNxfB
— Norway Chess (@NorwayChess) June 6, 2025