Carlos Alcaraz | బీజింగ్: టాప్ సీడ్ కార్లోస్ అల్కారజ్ (స్పెయిన్) చైనా ఓపెన్‌లో క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. బీజింగ్‌లో జరుగుతున్న ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన అల్కారజ్.. 6-1, 6-2తో టాలన్ గ్రీక్స్పూర్ (నెదర్లాండ్స్)ను ఓడించాడు. ప్రత్యర్థి నుంచి కనీస ప్రతిఘటన కూడా లేకుండానే ఈ స్పెయిన్ కుర్రాడు మ్యాచ్‌ను ముగించాడు.
క్వార్టర్స్‌లో అతడు కరెన్ కచనోవ్ (రష్యా)తో తలపడాల్సి ఉంది. మహిళల డబుల్స్‌లో అమెరికా టెన్నిస్ క్రీడాకారాణి కోకో గాఫ్ 7-5, 6-2తో కేటీ బౌల్టర్ (బ్రిటన్)ను చిత్తుచేసి ప్రిక్వార్టర్స్‌కు చేరింది. రౌండ్-32లో మరో టాప్ సీడ్ జెస్సికా పెగుల 6-7 (9/11), 6-1, 6-2తో వెరొనిక (రష్యా)ను ఓడించింది.