Ashes Series : యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ బౌలర్ల జోరుకు ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్లు బ్రేకులు వేశారు. టాపార్డర్ విఫలమైనా.. అలెక్స్ క్యారీ(106) సూపర్ శతకంతో చెలరేగాడు. అడిలైడ్‌లో జోఫ్రా ఆర్చర్(3-29) నిప్పులు చెరిగినా.. పట్టుదలగా క్రీజులో నిలిచిన క్యారీ కెరీర్లో మూడో సెంచరీ సాధించాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ఉస్మాన్ ఖవాజా(82) మెరుపు అర్ధ శతకంతో రాణించగా.. తొలిరోజే ఆసీస్ మూడొందలు కొట్టింది. ఆట ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది ఆతిథ్య జట్టు.
సొంతగడ్డపై జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో అదరగొడుతున్న ఆస్ట్రేలియా మూడో మ్యాచ్‌లోనూ గొప్పగా ఆడింది. తొలి సెషన్లో ఇంగ్లండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్(3-29), బ్రైడన్ కార్సే(2-70)ల విజృంభణతో కష్టాల్లో పడిన ఆసీస్ అనూహ్యంగా పుంజుకుంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(10), జేక్ వెథెరాల్డ్(18)లు నిరాశపరచగా.. మార్నస్ లబూషేన్(19)ను వెనక్కి పంపిన ఆర్చర్ కంగారూ టీమ్‌ను దెబ్బకొట్టాడు. ఐపీఎల్ వేలంలో రికార్డు ధర పలికిన కామెరూన్ గ్రీన్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆర్చర్ ఓవర్లో కార్సే స్టన్నింగ్ క్యాచ్‌తో గ్రీన్ ఔట్ కావడంతో 94కే నాలుగు వికెట్లు కోల్పోయింది ఆతిథ్య జట్టు.
“That one is for you dad!”
A wonderful moment as the hometown hero Alex Carey brings up 100.#Ashes | #PlayoftheDay | @nrmainsurance pic.twitter.com/aEdfwRedz5
— cricket.com.au (@cricketcomau) December 17, 2025
ప్రధాన బ్యాటర్లు విఫలమైనా.. నేనున్నానంటూ ఉస్మాన్ ఖవాజా(82) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. స్వీప్ షాట్లతో అలరించిన ఖవాజా అర్ధ శతకంతో జట్టును ఆదుకున్నాడు. శతకానికి చేరువైన ఈ లెఫ్ట్ హ్యాండర్‌ను జాక్స్ ఔట్ చేశాక.. అలెక్స్ క్యారీ(106) విధ్వంసం కొనసాగించాడు. జోష్ ఇంగ్లిస్(32) ప్యాట్ కమిన్స్(13) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగినా.. దూకుడుగా ఆడిన క్యారీ మిచెల్ స్టార్క్(33 నాటౌట్)తో కలిసి ౫౦ పరుగులు జోడించాడు. పెద్ద షాట్ ఆబబోయి క్యారే ఔటైనా స్టార్క్ పట్టుదలగా ఆడాడు. దాంతో తొలిరోజు ఆట ముగిసే సరికి ఆతిథ్య జట్టు 8 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. స్టార్క్ జతగా నాథన్ లియాన్(0 నాటౌట్) క్రీజులో ఉన్నారు.