అడిలైడ్ : టి20 ప్రపంచకప్‌లో ఆసీస్ జట్టును గాయాల బెడద పీడిస్తున్నది. వారి కెప్టెన్ అరోన్ ఫించ్‌తోపాటు టిమ్ డేవిడ్, మార్కస్ స్టొయినిస్‌లు పిక్కల గాయంతో బాధపడుతున్నారు. శుక్రవారం అఫ్గానిస్థాన్‌తో జరుగనున్న మ్యాచ్‌లో ఫించ్ ఆడేది అనుమానమే. సోమవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫించ్ బ్యాటింగ్ చేసినా చివరలో ఫీల్డింగ్నుంచి తప్పుకున్నాడు. డేవిడ్, స్టొయినిస్ ఫీల్డింగ్నుంచి పూర్తిగా తప్పుకున్నారు. అఫ్గాన్‌తో మ్యాచ్ సమయానికి ఫించ్ కోలుకోకపోతే మాథ్యూ వేడ్ పగ్గాలు చేపడతాడు. ఆసీస్ సెమీస్‌కు చేరుకోవాలంటే అఫ్గానిస్థాన్‌పై భారీ తేడాతో గెలవాల్సి ఉంది.