T20 World Cup 2026 : వచ్చే ఏడాది జరుగబోయే పురుషుల టీ20 వరల్డ్ కప్ పోటీలకు మరో జట్టు అర్హత సాధించింది. అమెరికా రీజినల్ నుంచి కెనడా (Canda) జట్టు బెర్తు ఖరారు చేసుకుంది. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ ఫైనల్స్లో విజయంతో మెగా టోర్నీకి క్వాలిఫై అయింది. మొత్తంగా వరల్డ్ కప్ బరిలో ఉన్న 13వ జట్టుగా నిలిచింది కెనడా. ఆదివారం జరిగిన అమెరికా రీజినల్ ఫైనల్లో బహమాస్ (Bahamas)పై నికోలస్ కిర్టన్ బృందం సూపర్ విక్టరీ కొట్టింది. తొలుత బహమాస్ను 57కే పరిమితం చేసిన కెనడా.. స్వల్ప లక్ష్యాన్ని కెనడా 5.3 ఓవర్లలోనే ఛేదించింది. ఈ లీగ్లో వరుసగా నాలుగో విజయంతో వరల్డ్ కప్ టోర్నీకి ఎంపికైంది నికోలస్ టీమ్.
పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 పోటీలకు భారత్, శ్రీలంకలు సయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి ఇప్పటికే 12 జట్లు క్వాలిఫై అయ్యాయి. టీమిండియా, లంకతో పాటు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, యూఎస్ఏ, వెస్టిండీస్.. వరల్డ్ కప్ రేసులో నిలిచాయి.
Read more 👇 https://t.co/avMdCT0un1
— ESPNcricinfo (@ESPNcricinfo) June 22, 2025
మరో ఏడు జట్లకు బెర్తులు ఖరారు కావాల్సి ఉంది. వీటిలో యూరోపియన్ క్వాలిఫయర్ ద్వారా 2, ఆఫ్రికా క్వాలిఫయర్లో ఫైనల్ చేరిన రెండు జట్లతో పాటు ఆసియా యూఏపీ క్వాలిఫయర్లోని టాప్-3 జట్లు వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధిస్తాయి.