Under-19 World Cup Qualifiers : ప్రపంచ క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. కేవలం ఐదంటే ఐదు బంతుల్లోనే ఒక జట్టు మ్యాచ్‌ను ముగిసింది. అండర్ -19 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్(Under-19 World Cup Qualifiers)లో రికార్డు విజయంతో పసికూన కెనడా (Canada) చరిత్ర సృష్టించింది. తన కంటే చిన్న జట్టు అర్జెంటీనా(Arjentina)ను బెంబేలిత్తించి స్వల్ప లక్ష్యాన్ని మొదటి ఓవర్లోనే ఛేదించింది. కెనాడా సాధించిన ఈ ఘనత వన్డే క్రికెట్లో అరుదైన, వేగవంతమైన విక్టరీగా చరిత్రలోనిలిచిపోనుంది.
అండర్ -19 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా జార్జియాలోని పరమ్ వీర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కెనడా, అర్జెంటీనా తలపడ్డాయి. ఫుట్‌బాల్‌కు కేరాఫ్ అయిన దక్షిణ అమెరికా దేశపు జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. అయితే.. కెనడా బౌలర్ల ధాటికి అర్జెంటీనా బ్యాటర్లలో ఒక్కరంటే ఒక్కరూ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. జగ్మన్దీప్ పాల్ (6-7) విజృంభణకు విలవిలడానికి ప్రత్యర్థి 19.4 ఓవర్లలో కేవలం 23 రన్స్‌కే పరిమితైమంది.
Clinical performance to bounce back after bowling out the opposition for 23 💫
Eyes forward — on to the next one!#CricketCanada #WeCANcricket #U19WorldCupQualifiers pic.twitter.com/WxwHD8kqZO
— Cricket Canada (@canadiancricket) August 10, 2025
స్వల్ప లక్ష్యం కావడంతో కెనడా పది వికెట్ల తేడాతో గెలుపొందడం ఖాయం అనిపించింది. కానీ, అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఆ జట్టు టార్గెట్‌ను ఛేదించింది. ఓపెనర్ ధర్మ్ పటేల్ (1 నాటౌట్) తొలి బంతికి సింగిల్ తీయగా.. మరో ఓపెనర్ యువరాజ్ సమ్రా(22 నాటౌట్) నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో జట్టుకు చరిత్రాత్మక విజయాన్ని అందించాడు.
వన్డే క్రికెట్లో అత్యల్ప స్కోర్ రికార్డు మాత్రం స్కాట్లాండ్ పేరిట ఉంది. 2004లో జరిగిన ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కోలేక అండర్ -19 వరల్డ్ కప్‌లో ఆ జట్ట 22 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 3.5 ఓవర్లలో ఛేదించింది. కానీ, ఈసారి కెనడా జట్టు తొలి ఓవర్లో మరో బంతి మిగిలి ఉండగానే టార్గెట్‌ను అందుకొని రికార్డు నెలకొల్పింది.