ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో మరికాసేపట్లో తొలి మ్యాచ్ జరగనుంది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. చెన్నైపై టాస్ గెలిచిన వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ప్రస్తుత సీజన్లో హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత గెలుపు రుచి చూసిన హైదరాబాద్ ఆ తర్వాతి మ్యాచ్‌లో మళ్లీ ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో గత మ్యాచ్‌లో ఆ జట్టు సూపర్ ఓవర్లో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో వరుస విజయాలతో జోరుమీదున్న చెన్నైకి హైదరాబాద్ ఏమేరకు పోటీనిస్తుందో చూడాలి!
లీగ్‌లో ఈ రెండు జట్లు ఇప్పటి వరకూ 14 మ్యాచ్‌ల్లో తలపడగా..10 మ్యాచ్‌ల్లో చెన్నై టీమ్ విజయం సాధించింది. మిగిలిన 4 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ గెలుపొందింది.
Toss Update: @SunRisers have won the toss and they have opted to bat first against @ChennaiIPL https://t.co/dvbR7X1Kzc #VIVOIPL #CSKvSRH pic.twitter.com/8wmi572lJo
— IndianPremierLeague (@IPL) April 28, 2021
Match 23. Chennai Super Kings XI: F du Plessis, R Gaikwad, M Ali, S Raina, A Rayudu, R Jadeja, MS Dhoni, S Curran, S Thakur, D Chahar, L Ngidi https://t.co/w7vUSl6314 #CSKvSRH #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 28, 2021
Match 23. Sunrisers Hyderabad XI: D Warner, J Bairstow, K Williamson, M Pandey, V Shankar, K Jadhav, R Khan, J Suchith, S Sharma, S Kaul, K Ahmed https://t.co/w7vUSl6314 #CSKvSRH #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 28, 2021