సీరోలు (కురవి), జనవరి 20: మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కాంపల్లి పీఎంశ్రీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు భానుప్రియ, నందిని జాతీయస్థాయి షూటింగ్ బాల్ టోర్నీకి ఎంపికయ్యారు. ఈనెల 18న తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలో నిర్వహించిన అండర్-14 రాష్ట్ర స్థాయి పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచారు. ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ డోలి అరుణశ్రీ తెలిపారు. విద్యార్థినులకు వ్యాయామ ఉపాధ్యాయురాలు భారతి, యోగా కోచ్ నరేశ్ శిక్షణ నిచ్చారని పేరొన్నారు. విద్యార్థినులను పాఠశాల స్టాఫ్ సెక్రటరీ సునీల్‌కుమార్, ఉపాధ్యాయులు అభినందించారు.