న్యూఢిల్లీ: రెండో టెస్టు(India Vs West Indies)లో వెస్టిండీస్ బ్యాటర్లు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఫాలోఆన్ ఆడుతున్న విండీస్ జట్టు నాలుగో రోజు తొలి సెషన్లో కీలకమైన రన్స్ చేసింది. విండీస్ బ్యాటర్ జాన్ క్యాంప్‌బెల్ సెంచరీ కొట్టాడు. జడేజా బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టి తన ఖాతాలో సెంచరీ వేసుకున్నాడు. 174 బంతుల్లో అతను సెంచరీ పూర్తి చేశాడు. ఈ సిరీస్‌లో విండీస్ బ్యాటర్ సెంచరీ కొట్టడం ఇదే మొదటిసారి. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై పట్టుదలతో క్యాంప్‌బెల్ తన ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. విండీస్ జట్టులోని సభ్యులంతా అతనికి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత జడేజా బౌలింగ్‌లో అతను ఔటయ్యాడు.
మరో బ్యాటర్ శాయ్ హోప్ కూడా సెంచరీతో ఆకట్టుకున్నాడు. 204 బంతుల్లో హోప్ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో అతనికి ఇది మూడో సెంచరీ కావడం విశేషం. దాదాపు 8 ఏళ్ల విరామం తర్వాత అతను టెస్టుల్లో సెంచరీ కొట్టాడు. క్యాంప్‌బెల్, హోప్‌లు మూడో వికెట్‌కు 177 రన్స్ జోడించారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కేవలం 248 రన్స్‌కే ఆలౌట్ అయిన విండీస్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దీటుగా బదులిస్తోంది. ప్రస్తుతం హోప్, ఛేజ్ నాలుగో వికెట్‌కు అజేయంగా 50 రన్స్పైగా జోడించారు. ఇండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 270 రన్స్ చేసిన విషయం తెలిసిందే.
తాజా సమాచారం ప్రకారం విండీస్ తన రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 271 రన్స్ చేసింది. హోప్ 102 రన్స్ చేసి ఔటయ్యాడు. ఛేజ్ 30 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు. వెస్టిండీస్ ప్రస్తుతం ఆధిక్యంలోకి వెళ్లింది.
Well worth the wait, test match century no.3️⃣#INDvWI | #MenInMaroon pic.twitter.com/NiI14GzpH2
— Windies Cricket (@windiescricket) October 13, 2025