కృష్ణ కాలనీ, డిసెంబర్ 17: అమెరికాలోని అలాబామా స్టేట్స్ హన్స్ విల్ సిటీలో రాకెట్ సిటీ నిర్వహించిన మారథాన్ రన్ (21 కిలో మీటర్ల విభాగం)లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన బుర్ర లాస్యగౌడ్ బంగారు పతకం సాధించింది.
గతంలో అమెరికాలోని మినెసొటా రాష్ర్టానికి క్రికెట్లో ప్రాతినిధ్యం వహించడంతోపాటు తెలంగాణ అండర్- 19 క్రికెట్ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆమె.. తాజాగా మారథాన్లోనూ సత్తాచాటింది. లాస్య క్రీడా స్ఫూర్తిని గుర్తించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి ఫోన్ ద్వారా ఆమెకు అభినందనలు తెలిపారు.