మెల్బోర్న్: బాక్సింగ్ డే టెస్టుపై భారత్ (IND vs AUS) పట్టుబిగిస్తున్నది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అద్భుత పోరాటంతో టీమ్ఇండియా (Team India) పోటీలోకి వచ్చింది. నాలుగోరోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే భారత్ ఆలౌట్ అయింది. 9 పరుగులు మాత్రమే జోడించిన సెంచరీ హీరో నితీశ్ రెడ్డి (114) లియోన్ బౌలింగ్‌లో స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఆస్ట్రేలియాకు 120 పరుగుల ఆధిక్యం లభించింది.
అనంతరం రెండో ఇన్సింగ్స్ ప్రారంభించిన ఆసీస్ బ్యాటర్లకు టీమ్ఇండియా పేసర్లు చుక్కలు చూపించారు. ఏ దశలోను కుదురుకోనియకుండా క్రమంతప్రకుండా వికెట్లు పడగొడుతున్నారు. దీంతో ఆతిథ్య జట్టు 85 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయింది. బుమ్రా వేసిన 6 ఓవర్లో ఆసీస్ ఓపెనర్ కొన్‌స్టాస్ (8) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో ప్రారంభమైన వికెట్ల పతనాన్ని సిరాజ్ కొనసాగించాడు. 43 పరుగుల వద్ద ఉస్మాన్ ఖవాజా వికెట్ పడగొట్టాడు. ఇద్దరు సీమర్లు పోటాపోటీగా వికెట్లు పడగొట్టడంతో 93 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయింది. బుమ్రా 4 వికెట్లు తీయగా, సిరాజ్ ఇద్దరిని ఔట్ చేశాడు. ఆస్ట్రేలియా ప్రస్తుతం 192 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది.
It’s Jasprit Bumrah’s world and we’re all living in it 😎😎
Live – https://t.co/MAHyB0FTsR… #AUSvIND | @Jaspritbumrah93 pic.twitter.com/RVUlhzNQYX
— BCCI (@BCCI) December 29, 2024