IND vs SA 1st Test : సొంతగడ్డపై మరో టెస్టు సిరీస్‌పై గురిపెట్టిన జట్టు ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈడెన్ గార్డెన్స్‌లో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ విజేత దక్షిణాఫ్రికా(South Africa)ను టీమిండియా వణికించింది. తొలి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా(35-27) నిప్పులు చెరగడంతో సఫారీలను 159కే ఆలౌట్ చేసిన భారత్ తొలి రోజు పైచేయి సాధించింది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన గిల్ సేన వికెట్ కోల్పోయి 37 రన్స్ చేసింది. ఆట ముగిసే సరికి ఓపెనర్ కేఎల్ రాహుల్(13 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(6 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు.
ఇంగ్లండ్ పర్యటనలో సిరీస్ సమం చేసిన టీమిండియా సొంతగడ్డపై జోరు చూపిస్తోంది. వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేసిన భారత్ ఈసారి డబ్ల్యూటీసీ విజేత దక్షిణిఫ్రికాను రెండొందలలోపే కుప్పకూల్చింది. పేస్ ట్రాక్ మీద ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా(5-27) రెచ్చిపోవడంతో సఫారీలు డగౌట్‌కు క్యూ కట్టారు. బుమ్రాకు కుల్దీప్ యాదవ్ తోడవ్వడంతో పర్యాటక జట్టు ఆలౌటయ్యింది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(12) వికెట్ కోల్పోయింది.
𝘽𝙤𝙬𝙡𝙞𝙣𝙜 𝘽𝙡𝙞𝙩𝙯 🔥
Jasprit Bumrah was on a roll at the Eden Gardens ⚡️
Watch his outstanding spell ▶️ https://t.co/If1vSkt7ec#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @Jaspritbumrah93 pic.twitter.com/01QZZn3d0w
— BCCI (@BCCI) November 14, 2025
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్(6 నాటౌట్), కేఎల్ రాహుల్(13 నాటౌట్) మరో వికెట్ పడనీయలేదు. అయితే.. వెలుతురు తగ్గిపోవడంతో త్వరగానే ఆటను ముగించారు. దాంతో.. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 37 పరుగులు చేసిన టీమిండియా ఇంకా 122 పరుగులు వెనకబడి ఉంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు రియాన్ రికెల్టన్(23) ఎడెన్ మర్క్రమ్(31)లు ధనాధన్ ఆడుతూ భారత్‌పై ఒత్తిడి పెంచాలనుకున్నారు. తొలి వికెట్‌కు 57 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని జస్ప్రీత్ బుమ్రా విడదీసి వికెట్ల వేటకు తెరతీశాడు. మొదట రికెల్టన్ను బౌల్డ్ చేసిన యార్కర్ కింగ్ ఆ తర్వాత.. మర్క్రమ్ను పెవిలియన్ పంపాడు.
🎥 A glimpse of Jasprit Bumrah’s Eden Gardens masterclass! \|/ 🙌
Updates ▶️ https://t.co/okTBo3qxVH#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @Jaspritbumrah93 pic.twitter.com/dmkaVZXRIk
— BCCI (@BCCI) November 14, 2025
ఆ తర్వాత కెప్టెన్ తెంబా బవుమా(3)ను కుల్దీప్ యాదవ్ బోల్తా కొట్టించాడు. 82కే మూడు వికెట్ల పడిన వేళ.. కుర్రాళ్లు టోనీ బ్రిట్జ్(24), ట్రిస్టన్ స్టబ్స్(15 నాటౌట్) సఫారీ టీమ్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ కీలక రన్స్ జోడించి స్కోర్ వంద దాటించారు. అయితే.. ఈ జోడీని విడదీసిన బుమ్రా.. ఆ తర్వాత మరో రెండు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా పతనాన్ని శాంసించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా టెయిలెండర్ల సాయంతో స్టబ్స్ జట్టు స్కోర్ రెండొందలు దాటించాలనుకున్నాడు. కానీ.. హర్మర్, కేశవ్ మహరాజ్(0)లను ఔట్ చేసిన బుమ్రా 159కేసఫారీల ఇన్నింగ్స్ ముగించాడు.