IND vs AFG : లీగ్ దశను ఓటమితో ముగించిన అఫ్గనిస్థాన్ సూపర్8లోనూ అదే బాటలో నడుస్తోంది. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ధాటికి కాబూలీ టీమ్ మూడు వికెట్లు కోల్పోయింది. అఫ్గన్ జట్టు 182 పరుగుల ఛేదనలో ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. అయితే.. బౌండరీలతో చెలరేగాలనుకున్న రహ్మనుల్లా గుర్బాజ్(11)ను వెనక్కి పంపి బ్రేకిచ్చాడు.
ఆ తర్వాత అక్షర్ పటేల్ ఓవర్లో .. ఇబ్రహీం జద్రాన్(8). రోహిత్‌కు తేలికైన క్యాచ్ ఇచ్చాడు. మళ్లీ బంతి అందుకున్న బుమ్రా తొలి బంతికే హజమతుల్లా జజాయ్(2)ను వెనక్కి పంపాడు. అంతే.. అఫ్గన్ జట్టు పవర్ ప్లేను 35-3తో ముగించింది. ప్రస్తుతం ఆల్‌రౌండర్లు అజ్మతుల్లా ఒమర్జాయ్(5), గుల్బదిన్ నయూబ్(7)లు కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకునే పనిలో ఉన్నారు.