IND vs ENG : సిరీస్ విజేతను నిర్ణయించే ఓవల్ టెస్టులో ఇంగ్లండ్(England) విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాటర్టు సమిష్టిగా రాణించి ఆశలు రేపినా బౌలర్లు తేలిపోవడంతో.. నాలుగో రోజు ఆతిథ్య జట్టు బ్యాటర్లు వికెట్ ఇవ్వడం లేదు. యువ కెరటం హ్యారీ బ్రూక్ (111) సెంచరీతో చెలరేగగా, రన్ మెషీన్ జో రూట్ (98 నాటౌట్) అర్ధ శతకంతో టీమిండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లారు.
భారత పేస్ దళాన్ని సమర్ధంగా ఎదుర్కొన్న ఈ ద్యయం కొండంత లక్ష్యాన్ని చూస్తుండగానే కరిగించింది. అయితే.. టీకి ముందు బ్రూక్ను ఆకాశ్ దీప్ ఔట్ చేసి ఊరటనిచ్చాడు. కానీ, జాకబ్ బె|థెల్(1) అండగా రూట్ జట్టును సిరీస్ విజేతగా నిలిపేందుకు గట్టిగానే పోరాడుతున్నాడు. టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ 317 రన్స్ కొట్టింది. మరో 57 రన్స్ కొడితే తొలిసారి నిర్వహిస్తున్న అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీని కైవసం చేసుకోనుంది.
Joe Root goes into tea on 98* after his 195-run stand with Harry Brook put England on course for a stunning victory at The Oval!
Ball-by-ball: https://t.co/rrZF1qeH0S pic.twitter.com/n98MEYFNMk
— ESPNcricinfo (@ESPNcricinfo) August 3, 2025