మకావు: మకావు ఓపెన్ సూపర్-300 టోర్నీలో భారత యువ ద్వయం గాయత్రి గోపీచంద్, త్రిసాజాలీకి కాంస్య పతకం దక్కింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో గాయత్రి, త్రిసా జోడీ 17-21, 21-16, 10-21తో చైనీస్‌తైపీ జంట హు పీ షాన్, హంగ్ ఎన్జు చేతిలో పోరాడి ఓడింది. మూడోసీడ్‌గా బరిలోకి దిగిన గాయత్రి, త్రిసా.. చైనీస్ జోడీకి దీటైన పోటీనివ్వడంలో విఫలమయ్యారు. తొలి గేమ్‌లో ఒకింత ప్రతిఘటన కనబరిచినా..వీరు రెండో గేమ్ గెలిచి పోటీలోకి వచ్చారు. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి ఊహించని పరాజ యం ఎదురైంది. వీరి నిష్క్రమణతో మకావు ఓపెన్‌లో భారత్ పోరాటం ముగిసింది.