హైదరాబాద్, ఆట ప్రతినిధి: జమ్ము కశ్మీర్ వేదికగా తొలిసారి జరిగిన ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ తెలంగాణకు కాంస్య పతకం దక్కింది. పోటీలకు ఆఖరి రోజైన శనివారం జరిగిన పురుషుల రోయింగ్ కాక్స్లెస్ పెయిర్ ఫైనల్లో తెలంగాణ ద్వయం నవదీప్, హర్దీప్సింగ్ 3:20:26t సెకన్ల టైమింగ్తో మూడో స్థానంలో నిలిచి కాంస్యం కైవసం చేసుకుంది.
ఇదే పోటీలో మహారాష్ట్ర(3:12:13సె), మధ్యప్రదేశ్(3:15:4సె) వరుసగా స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకున్నారు. మొత్తంగా టోర్నీలో 18 పతకాలతో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో నిలువగా, ఒడిశా, కేరళ రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి.