NZW vs SAW : వరల్డ్ కప్‌ను ఓటమితో ఆరంభించిన దక్షిణాఫ్రికా రెండో పోరులో గెలుపు దిశగా సాగుతోంది. న్యూజిలాండ్ నిర్దేశించిన స్వల్ప ఛేదనలో ఓపెనర్ తంజిమ్ బ్రిస్త్ (66 నాటౌట్) రెచ్చిపోయి ఆడుతోంది. కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన తను.. సోఫీ డెవినె ఓవర్లో బౌండరీతో అర్ధ శతకం సాధించింది. సునే లుస్(38 నాటౌట్)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఇప్పటికే 105 రన్స్ జోడించారు. దాంతో.. 22 ఓవర్లకు సఫారీ టీమ్ వికెట్ నష్టానికి 131 పరుగులు చేసింది. ఇంకా విజయానికి పరుగులు కావాలంతే.
న్యూజిలాండ్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసిన దక్షిణాఫ్రికు ఓపెనర్ తంజిమ్ బ్రిస్త్ (66 నాటౌట్) శుభారంభం ఇచ్చింది. ఓపెనర్ లారా వొల్వార్డ్త్(14) త్వరగానే ఔటైనా.. గెలుపు బాధ్యత తీసుకున్న ఆమె సునే లుస్( 38 నాటౌట్)తో కలిసి కివీస్ బౌలర్ల భరతం పడుతోంది. క్రీజులో కుదురుకునేదాక సింగిల్స్, డబుల్స్‌కే పరిమితమైన బ్రిస్త్ ఆ తర్వాత గేర్ మార్చింది. సునే సైతం దంచేస్తుండడంతో సఫారీ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. డెవినే వేసిన 19వ ఓవర్లో బౌండరీతో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది బ్రిస్త్. విధ్వంసక ఆటతో చెలరేగిన తను 44 బంతుల్లోనే అర్ధ శతకం బాదేసింది.
South Africa are going strongly in the chase with Tazmin Brits hitting her maiden World Cup fifty off 44 balls 👏
🔗 https://t.co/pOiRkp1l9R | #CWC25 pic.twitter.com/EsKRKL6Tne
— ESPNcricinfo (@ESPNcricinfo) October 6, 2025
వన్డే వరల్డ్ కప్‌లో బోణీ కోసం ఎదురుచూస్తున్న దక్షిణాఫ్రికాకు సూపర్ ఛాన్స్ దొరికింది. బలమైన న్యూజిలాండ్‌ను సఫారీ టీమ్ 250లోపే కట్టడి చేసింది. కెప్టెన్ సోఫీ డెవినె (85), బ్రూక్ హల్లిడే (38 నాటౌట్) జోరుతో భారీ స్కోర్ చేస్తుందనుకున్న న్యూజిలాండ్ ఆఖర్లో తడబడింది. డెవెనెను బౌల్డ్ చేసిన మలబా విజృంభణతో కివీస్ కోలుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన వారు ఎవరూ క్రీజులో నిలవలేకపోవడంతో 11 పరుగుల వ్యవధిలోనే చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది వైట్ ఫెర్న్స్. కొండంత స్కోర్ కొడుతుందనుకున్న జట్టు అనూహ్యంగా 231కే ఆలౌటయ్యింది.