లండన్: స్కూల్ పిల్లల్లో క్రికెట్ పట్ల ఆసక్తి పెంచేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak) కొత్త పథకాన్ని ఆవిష్కరించారు. యువతను క్రికెట్ వైపు మళ్లించేందుకు సుమారు 35 మిలియన్ల పౌండ్ల పెట్టుబడితో ఓ కొత్త ప్లాన్ను ఆవిష్కరించారు. ఆ నిధులతో సుమారు 9 లక్షల మంది యువతను క్రికెట్ వైపు ఆకర్షించేందుకు ప్రణాళిక రచించారు. దీనిపై బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ ఓ ట్వీట్ చేశారు. గ్రామీణ స్థాయిలో క్రికెట్ పట్ల స్కూల్ పిల్లల్లో ఆసక్తి పెంచేందుకు ఆ ప్రణాళికలను అమలు చేయనున్నట్లు చెప్పారు. 2030లోగా సుమారు పది లక్షల మంది విద్యార్థులను క్రికెట్ వైపు మళ్లించేందుకు చర్యలు చేపడుతున్నామని రిషి సునాక్ తెలిపారు. ఈ ప్రోగ్రామ్లో పాల్గొననున్న ప్రతి స్కూల్కు సుమారు 2500 కొత్త ఎక్విప్మెంట్ను అందివ్వనున్నారు.
I love cricket, that’s no secret.
So I’m pleased that today we can support even more young people to get into the game.
We’re investing £35 million in grassroots cricket to help over 900,000 young people into playing cricket. pic.twitter.com/mN1rauyOYI
— Rishi Sunak (@RishiSunak) April 5, 2024