Wimbledon : ప్రతిష్ఠాత్మక వింబుల్డన్(Wimbledon) టోర్నీ కళ తప్పనుంది. ఇప్పటికే మాజీ నంబర్ 1 రఫెల్ నాదల్ (Rafael Nadal) టోర్నీ నుంచి వైదొలగగా.. బ్రిటన్ స్టార్ ఆటగాడు ఆండీ ముర్రే (Andy Murray) సైతం తాను కూడా ఆడట్లేదని చెప్పేశాడు. గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు ఆదివారం అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య(ATP) ఓ ప్రకటనలో తెలిపింది.
వెన్నునొప్పితో బాధపడుతున్న ముర్రే త్వరలోనే సర్జరీ చేయించుకోనున్నాడు. అనంతరం కోలుకునేందుకు రెండు మూడు వారాలపైనే పట్టనుంది. దాంతో, వింబుల్డన్ నుంచి వైదొలగాలని ముర్రే భావించాడు.ప్రపంచ టెన్నిస్లో బ్రిటన్ ఆధిపత్యానికి ముర్రే నాంది పలికాడు. రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్ వంటి దిగ్గజాలకు సవాల్ విసురుతూ రెండు పర్యాయాలు(2013, 2016) వింబుల్డన్ ట్రోఫీ గెలిచాడు.
మాజీ వరల్డ్ నంబర్ 1 అయిన ముర్రే ప్రస్తుతం వెన్నునొప్పితో సతమతమవుతున్నాడు. అతడి వెన్నుముకలో చిన్న కణితి (నీరు లేదా గాలి బుడగ) ఒకటి ఉంది. అందువల్ల అతడు వింబుల్డన్ కంటే ముందు సర్జరీకి సిద్ధమయ్యాడు. ప్యారిస్ ఒలింపిక్స్లో బ్రిటన్ బృందానికి ముర్రే నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.