GST Council | జీఎస్టీ కౌన్సిల్ లోకి 11 మంది కొత్త ఆర్థిక మంత్రులు.. త్వరలో మూడు జీఓఎంల పునర్వ్యవస్థీకరణ..
GST Council | కొత్తగా 11 రాష్ట్రాల నుంచి ఆర్థిక మంత్రులు చేరడంతో మూడు మంత్రుల బృందాలను జీఎస్టీ కౌన్సిల్ పునర్వ్యవస్థీకరించనున్నది.
GST Council | కొత్తగా 11 రాష్ట్రాల నుంచి ఆర్థిక మంత్రులు చేరడంతో మూడు మంత్రుల బృందాలను జీఎస్టీ కౌన్సిల్ పునర్వ్యవస్థీకరించనున్నది. జీఎస్టీపై రెవెన్యూ, జీఎస్టీ కింద రియల్ ఎస్టేట్ రంగం పురోభివృద్ధి, జీఎస్టీ వ్యవస్థలో సంస్కరణలు అనే అంశాలపై మూడు మంత్రుల బృందాలను జీఎస్టీ కౌన్సిల్ నియమించనున్నది. శనివారం జీఎస్టీ కౌన్సిల్ 53వ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్ గఢ్, హరయానా, మధ్యప్రదేశ్, మిజోరం, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం, తెలంగాణ, త్రిపుర రాష్ట్రాల నుంచి కొత్త ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. గతేడాది అక్టోబర్ ఏడో తేదీన జీఎస్టీ కౌన్సిల్ 52వ సమావేశం జరిగింది.
జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణపై గత ఫిబ్రవరిలో మంత్రుల బృందం (జీఓఎం)ను పునర్వ్యవస్థీరించారు. దీనికి బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి కన్వీనర్‌గా నియమితులయ్యారు. మరో మూడు జీఓఎంల పునర్వ్యవస్థీకరణపై జీఎస్టీ కౌన్సిల్ ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు.
జీఎస్టీ ద్వారా రెవెన్యూపై విశ్లేషణకు ఏర్పాటైన జీఓఎంలో ఒడిశా ఆర్థిక మంత్రిని చేరుస్తారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిశాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అలాగే హర్యానా నుంచి కొత్త ఆర్థిక మంత్రి పేరు ఈ జీఓఎంలో చేరుస్తారు. రియల్ ఎస్టేట్ రంగంపై జీఎస్టీ జీఓఎంకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సారధ్యం వహిస్తున్నారు. బీహార్ ఆర్థిక మంత్రి మారిన నేపథ్యంలో పునర్వ్యవస్థీకరిస్తారు. అజిత్ పవార్ సారధ్యంలోనే జీఎస్టీ వ్యవస్థలో సంస్కరణలపై ఏర్పాటైన జీఓఎంలో అసోం, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు చోటు కల్పిస్తారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

