Football crazy | ఖతార్‌లో నిన్నటితో ముగిసిన ఫుట్బాల్వరల్డ్ కప్.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఫీవర్‌లో ముంచెత్తింది. ఫుట్‌బాల్ క్రేజీ అంతా ఇంతా కాదు. ఫుట్‌బాల్ చూసేందుకు స్టేడియంలకు జనం ఎగబడుతుంటారు. అందునా తమ అభిమన ఆటగాడి మ్యాచ్ ఉన్నదంటే ఇక వారి ఆదుర్తాకు అంతే ఉండదు. ఇటీవలి ఫుట్‌బాల్ వరల్డ్ కప్ మ్యాచుల్లో ఎందరో ఆడినా.. ఫైనల్ మ్యాచ్‌లో మెస్సీ-ఎంబాపె పోటీ పడటం ఉర్రూతలూగించింది. తమ అభిమాన ఆటగాళ్లను ఎక్కడ మిస్ అవుతామోనన్న బెంగతో కేరళలో పెండ్లి చేసుకుంటున్న ఓ జంట.. అలా పెండ్లి తంతు ముగియగానే.. ఇలా డ్రెస్సింగ్ మార్చుకుని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
కేరళకు చెందిన సచిన్-అథిరా జంట మరికొన్ని గంటల్లో ఒక్కటవుతున్న సమయంలోనే.. ఖతార్‌లో వరల్డ్ కప్ ఫైనల్స్ జరుగుతున్నాయి. అలా పెండ్లి ముగియగానే ఇలా తమకిష్టమైన ఆటగాళ్లు అయిన మెస్సీ, ఎంబాపె జెర్సీలను ధరించారు. సచిన్ అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీకి పెద్ద అభిమాని కాగా, అథిరా ఫ్రెంచ్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు ఎంబాపెకి గట్టి అభిమాని.
పెండ్లి తంతు ముగియగానే ఈ జంట ఫైనల్ మ్యాచ్ చూసేందుకు కొచ్చికి 206 కిలోమీటర్ల దూరంలోని తిరువనంతపురంలోని వరుడు సచిన్ ఇంటికి పరిగెత్తారు. పుట్‌బాల్ పట్ల కేరళ ప్రజలు ప్రత్యేకమైన అభిమానాన్ని కలిగి ఉన్నారు. ఫైనల్ మ్యాచ్ సమయంలో ఇక్కడి ఓ అభిమాని మెస్సీ భారీ కటౌట్‌ను సముద్రంలోతులో నెలకొల్పాడు. మరో అభిమాని స్టేడియం వద్ద భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశాడు.