Betway SA20 : భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బెట్‌వే ఎస్ఏ20 (Betway SA20) నాలుగో సీజన్ వేలంలో చక్రం తిప్పాడు. ఈ మధ్యే ప్రిటోరియా క్యాపిటల్స్ ప్రధాన కోచ్‌గా ఎంపికైన దాదా.. తమ ఫ్రాంచైజీ డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis)ను దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో, ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడీ యువకెరటం. పొట్టి క్రికెట్ సంచలనంగా మారిన బ్రెవిస్‌ను ప్రిటోరియా ఏకంగా రూ.8.3 కోట్లకు సొంతం చేసుకుంది.
ఎస్ఏ20 నాలుగో సీజన్ వేలం జొహన్నెస్‌బర్గ్‌లో మంగళవారం జరిగింది. ఛైర్మన్ గ్రేమీ స్మిత్ ఆధ్వర్యంలో వేలం షురూ కాగా.. బ్రెవిస్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. డర్బన్ సూపర్ కింగ్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ ఈ చిచ్చరపిడుగును పట్టేసేందుకు ధరను పెంచుతూ పోయాయి. చివరకు ప్రిటోరియా రూ.8.3 కోట్లకు జూనియర్ డివిలియర్స్‌ను కొనుగోలు చేసింది.
‘Dewald Brevis’ now Most Expensive Player in SA20 Auction
Sold to Pretoria Capitals for R 16.50 Million 😮🔥 pic.twitter.com/K3NWYEBwjV
— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) September 9, 2025
‘వేలంలో బ్రెవిస్‌ను కొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అతడు అద్భుతమైన ఆటగాడు. గత ఏడాదిన్నర నుంచి ఈ యంగ్‌స్టర్ ఆట స్వరూపమే మారిపోయింది. ఆస్ట్రేలియా గడ్డపై ఈ మధ్యే అతడు విధ్వంసక సెంచరీతో చెలరేగాడు. ఇక రూ.8.3 కోట్లు అనేది పెద్ద మొత్తమే. అయితే.. అందుకు అతడు అన్నివిధాలా అర్హుడే. బ్రెవిస్‌ను ప్రిటోరియా కెప్టెన్ చేయడంపై ఇప్పుడే ఏమీ చెప్పలేం. మా స్క్వాడ్‌లో రస్సెల్, రూథర్‌ఫొర్డ్ వంటి హిట్టర్లు ఉన్నారు. ఇప్పుడు వీళ్లకు బ్రెవిస్ తోడవ్వనున్నాడు’ అని గంగూలీ వెల్లడించాడు.
ఎస్ఏ 20 వేలంలో బ్రెవిస్ అత్యధిక ధరతో రికార్డు నెలకొల్పగా ఏడెన్ మర్క్రమ్ రెండో స్థానంలో ఉన్నాడు. తొలి రెండు సీజన్లలో సన్‌రైజర్స్ ఈస్టర్న్ జట్టుకు రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన మర్క్రమ్ వేలంలో రూ.7.5 కోట్లు పలికాడు. ఆల్‌రౌండర్ అయిన అతడిని డర్బన్ సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. వియాన్ మల్డర్‌ను రూ.4.5కోట్లకు జోబర్గ్ సూపర్ కింగ్స్ పట్టేసింది.
#BetwaySA20 Season 4 :
Set 1 Marquee players 🔨
𝐒𝐎𝐋𝐃 𝐒𝐎𝐋𝐃 𝐒𝐎𝐋𝐃‼️ pic.twitter.com/sKYBxyLfJG— CricketAdda🇮🇳 (@Criktalks) September 9, 2025