SA vs AUS : మూడు టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియాకు దక్షిణాఫ్రికా (South Africa) భారీ షాకిచ్చింది. తొలి మ్యాచ్‌లో పోరాడిన ఓడిన సఫారీ బృందం ఈసారి రికార్డు స్కోర్‌తో కంగారూ జట్టును కంగారెత్తించింది. డెవాల్డ్ బ్రెవిస్ (125 నాటౌట్) మెరుపు శతకంతో భారీ స్కోర్ చేసిన ప్రొటీస్ టీమ్ బౌలింగ్‌లోనూ పంజా విసిరింది. కార్బిన్ బాస్చ్(3-20), యువ పేసర్ క్వెనా మఫాకా (3-57)లు విజృంబించడంతో మరో రెండున్నర ఓవర్లు ఉండగానే కుప్పకూలింది. 53 పరుగుల తేడాతో చిత్తైన ఆసీస్ సొంతగడ్డపై రెండో అతిపెద్ద ఓటమి మూటగట్టుకుంది.
పొట్టి ఫార్ములాలో దక్షిణాఫ్రికా జట్టు ఆల్‌రౌండ్ షోతో ఆస్ట్రేలియాకు ఝలక్ ఇచ్చింది. తొలి మ్యాచ్‌లో చివరిదాకా పోరాడి ఓడిన మర్క్రమ్ సేన ఈసారి ఆసీస్‌కు ముచ్చెమటలు పట్టిస్తూ జయభేరి మోగించింది. డార్విన్ మైదానంలో మంగళవారం యువకెరటం డెవాల్డ్ బ్రెవిస్ (125 నాటౌట్) విధ్వంసక శతకానికి ట్రిస్టన్ స్టబ్స్ (31) మెరుపులు తోడవ్వడంతో 7 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది ప్రొటీస్ టీమ్. గతంలో కంగారూలపై సఫారీల అత్యధిక స్కోర్ 204గా ఉండేది. జూనియర్ డివిలియర్స్ వీరకొట్టుడు కొట్టడంతో 9 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
AB de Villiers on Dewald Brevis:⁰“There was a golden chance for IPL teams to pick Dewald Brevis at the auction! Huge miss. CSK either got very lucky or pulled off the biggest masterstroke ever 👏 The boy can play.”
pic.twitter.com/noE8HqumOU— Kavya Maran (@Kavya_Maran_SRH) August 12, 2025
అనంతరం ఛేదనలో ఆసీస్‌కు కెప్టెన్ మర్క్రమ్ ఆదిలోనే షాకిచ్చాడు. డేంజరస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(5)ను ఔట్ చేసి ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత క్వెనా మఫాకా (3-57), రబడ వికెట్ల వేట కొనసాగించడంతో ఆస్ట్రేలియా కష్టాలు పెరిగాయి. గత మ్యాచ్ హీరో టిమ్ డేవిడ్ (50) అర్ధ శతకంతో గుబులు రేపినా రబడ అతడిని వెనక్కి పంపి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. కార్బిన్ బాస్చ్ ఎంగిడి సైతం చెలరేగగా.. వరుసగా వికెట్లు కోల్పోయింది కంగారూ టీమ్.
ఆఖర్లో అలెక్స్ క్యారీ(26) పోరాడినా టెయిలెండర్ల నుంచి సహకారం అందకపోవడంతో ఆసీస్ ఇన్నింగ్స్ 17.4 ఓవర్లోనే ముగిసింది. భారీ ఛేదనలో 165కే ఆలౌటైన మార్ష్ సేన దారుణ ఓటమి చవిచూడగా.. అద్భుతంగా ఆడిన సఫారీ టీమ్ సిరీస్ సమం చేసింది. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 జరుగనుంది.
All square 🤝
Australia and South Africa take it to a series decider 🍿 pic.twitter.com/sE1gOl0pXl
— ESPNcricinfo (@ESPNcricinfo) August 12, 2025