Brett Lee : ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం బ్రెట్ లీ (Brett Lee) అరుదైన ఘనత సాధించాడు. ఒకప్పుడు ఆ దేశ బౌలింగ్ దళంలో కీలకమైన ఈ మాజీ స్పీడ్‌స్టర్‌కు ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్(Hall Of Fame)లో చోటు దక్కింది. ప్రపంచ క్రికెట్లో ఆసీస్ ఆధిపత్యం కొనసాగడంలో బ్రెట్ లీది కీలక పాత్ర. రెండు వరల్డ్ కప్ విజయాల్లో.. యాషెస్ ట్రోఫీల గెలుపులోనూ భాగమైన ఈ మాజీ పేస్గన్కు ఆ దేశబోర్డు ఈ గుర్తింపు ఇచ్చింది. మెల్బోర్న్లో బాక్సింగ్ డే టెస్టు
యాషెస్ నాలుగో టెస్టుకు వైదికైన మెల్బోర్న్ మైదానంలో ఆదివారం హాల్ ఆఫ్ ఫేమ్ బోర్డుప పెట్టారు. ఆసీస్ వెటరన్ పేసర్ డెన్నిస్ లిల్లీ స్టాచ్యూ కింద ఏర్పాటు చేసిన హాల్ ఆఫ్ ఫేమ్‌లో బ్రెట్ లీకి చోటు దక్కింది. తనకు ప్రతిష్టాత్మక గౌరవం దక్కడం పట్ల బ్రెట్ లీ సంతోషం వ్యక్తం చేశాండు. తాను ఈ స్థాయికి రావడానికి కారణం పేస్ దిగ్గజం డెన్నిస్ లిల్లీ (Dennis Lillee) అని ఈ పేస్ దిగ్గజం అంటున్నాడు. ‘తొమ్మిదేళ్లు ఉన్నప్పుడే నాకు క్రికెట్ పిచ్చి పట్టుకుంది. గంటకు 160 కిలోమీటర్లు లేదా100 మీటర్ల వేగంతో బౌలింగ్ చేయాలని.. టెస్టు జట్టుకు ఎంపికై బ్యాగీ గ్రీన్ క్యాప్ పెట్టుకోవాలని కలలు కనేవాడిని.
Brett Lee has been inducted into the Australian Cricket Hall of Fame 🏅
What was your favourite memory of Brett Lee? 📷 #CricketTwitter pic.twitter.com/TSMr0ZdZmy
— Cricbuzz (@cricbuzz) December 28, 2025
టీనేజ్‌లోకి వచ్చాక డెన్నిస్ లిల్లీతో ఫాస్ట్ బౌలింగ్ క్యాంప్‌లో చేరాను. అక్కడ నన్ను చూసిన ఆయన.. ఇక్కడున్నవాళ్లలో నీవే చిన్నవాడివి. ఒక్క విషయం గుర్తుంచుకో. ఈ రెండేళ్లలో నీ బౌలింగ్ యాక్షన్‌ను మార్చుకోకుంటే చాలా కష్టపడుతావు అని లిల్లీ నాతో అన్నాడు. అయితే.. నేను ఆయన సలహాను పెద్దగా పట్టించుకోలేదు.16 ఏళ్ల వయసులో ఏం తెలుస్తుంది చెప్పండి.. ఆ తర్వాతి రెండేళ్లు నేను చాలా కష్టపడ్డాను. నా ప్రతిభను గుర్తించిన ఆస్ట్రేలియా క్రికెట్ లిల్లీతో ప్రాక్టీస్ చేయడం కోసం నన్ను పెర్త్‌కు పంపింది. నా కెరీర్ ఆసాంతం లిల్లీ వల్లనే బౌలింగ్ శైలిని మార్చుకున్నా. ఇదంతా తేలికగా జరిగిపోలేదు. ఎంతో కష్టపడ్డాను. చివరకు అనుకున్న వేగాన్ని అందకున్నా’ అని బ్రెట్ లీ వివరించాడు.
Brett Lee went through a lot, but his mentality never changed. For him, it was all about smashing those wickets.
Read the feature: https://t.co/5gKpGWoqj8 pic.twitter.com/6vpLyAyYnL
— cricket.com.au (@cricketcomau) December 28, 2025
‘నాకు వేగంగా బౌలింగ్ చేయడం థ్రిల్‌నిస్తుంది. స్టంప్స్ గాల్లోకి ఎగురడం చాలా నచ్చేది. అందుకే తొమ్మదేళ్లకే నేను ఫాస్ట్ బౌలర్ అవ్వాలనుకున్నా. గంటకు160 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయాలనుకున్నా. నాకు జెఫ్ థామస్ బౌలింగ్ అంటే ఇష్టం. 1979, 80ల్లో ఆయనను బాగా గమనించేవాడిని. థామ్సన్ గంటలకు160.45 కిలోమీటర్ల వేగంతో రికార్డు నెలకొల్పాడు. ఆ రికార్డును బ్రేక్ చేయాలనుకున్నా. అనుకున్నట్టే గంటకు 161.1కిలోమీటర్లతో థామ్సన్‌ను అధిగమించాను’ అని ఈ వెటరన్ పేసర్ తెలిపాడు.
ఆస్ట్రేలియా అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన బ్రెట్ లీ 76 టెస్టుల్లో 310 వికెట్లు పడగొట్టాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ ఈ డేంజరస్ పేసర్ హిట్టయ్యాడు. 221 వన్డేల్లో 380 వికెట్లు, 25 టీ20ల్లో 28 వికెట్లు కూల్చాడు. టీ20ల్లో మొట్టమొదటి హ్యాట్రిక్ వీరుడు కూడా అతడే. బంగ్లాదేశ్‌పై ఈ ఘనత సొంతం చేసుకున్నాడు.