రియో డి జనెరో: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ బ్రెజిల్ మరోసారి టైటిల్ ఫైట్‌కు చేరింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన సెమీస్‌లో బ్రెజిల్ 1-0 తేడాతో పెరూను ఓడించింది. మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్ 34వ నిమిషంలో లూకాస్ పక్వెటా కొట్టాడు. గోల్ పోస్టు వద్ద డిఫెండర్ అలెగ్జాండర్ కాలెన్స్ పాస్ చేసిన బంతిని విజయవంతంగా నెట్లోకి పంపిన లూకాస్.. బ్రెజిల్‌ను ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత ఇరు జట్లు హోరాహోరీగా పోరాడినా మరో గోల్ సాధ్యం కాలేదు. కాగా మరో సెమీస్‌లో మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు కొలంబియాను ఢీకొట్టనుంది. ఫైనల్లో తమ చిరకాల ప్రత్యర్థి అర్జెంటీనా ఎదురవ్వాలని కోరుకుంటున్నట్టు బ్రెజిల్ స్టార్ నెయ్మర్ జూనియర్ అన్నాడు. బ్రెజిల్ ఇప్పటి వరకు 9సార్లు కోపా టైటిల్ దక్కించుకోగా.. అర్జెంటీనా 14సార్లు సొంతం చేసుకుంది.