ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. సీజన్లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన బెంగళూరు రెట్టించిన ఉత్సాహంతో ఉంది. మరోవైపు ఆడిన తొలి మ్యాచ్‌లో ఓడినా.. ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలతో చెన్నై జోరుమీదుంది. ఈ రెండు జట్ల మధ్య ఫైట్ ఆసక్తికరంగా సాగనుంది. టాస్ గెలిచిన చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఫిట్‌గా లేకపోవడంతో ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చారు. లుంగి ఎంగిడి, అలీ స్థానంలో డ్వేన్ బ్రావో, ఇమ్రాన్ తాహిర్ తుది జట్టులోకి వచ్చినట్లు ధోనీ తెలిపాడు. మరోవైపు రిచర్డ్సన్ స్థానంలో క్రిష్టియన్, షాబాజ్ స్థానంలో నవదీప్సైనీలను ఎంపికచేసినట్లు కోహ్లీ పేర్కొన్నాడు.