Bradman Cap : ఆస్ట్రేలియా దిగ్గజం డొనాల్డ్ బ్రాడ్‌మన్ (Donald Bradman) ఆట ఎంత ఘనమో తెలిసిందే. తొలి తరం క్రికెటర్లలో రికార్డుల రారాజుగా వెలుగొందిన ఈ లెజెండరీ ఆటగాడి వస్తువులు వేలంలో కోట్లు కొల్లగొడుతున్నాయి. ఈ వెటరన్ ప్లేయర్ ఒకప్పుడు యాషెస్ సిరీస్‌లో ధరించిన బ్యాగీ గ్రీన్ క్యాప్(Baggy Green Cap) నిరుడు వేలంలో రూ. 2 కోట్లు పలికింది. తాజాగా ఆయన భారత జట్టుతో మ్యాచ్‌లో ఉపయోగించిన టోపీ ఏకంగా రూ.4 కోట్లకు అమ్ముడైంది.
క్రికెట్ తారల వస్తువులను అపురూపంగా భావిస్తారు అభిమానులు. తమ ఫేవరెట్ ఆటగాళ్ల గ్లోవ్స్, క్యాప్, బ్యాట్.. వంటి వాటిని వేలంలో పోటీపడి భారీ ధరకు దక్కించుకుంటారు కొందరు. ఆస్ట్రేలియా వెటరన్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ టెస్ట్ క్యాప్‌లను కోట్లు వెచ్చించి మరీ కొనుక్కుంటున్నారు ఫ్యాన్స్. ఈ దిగ్గజ ప్లేయర్ ధరించిన గ్రీన్ క్యాప్‌ను ఆ దేశంలోని జాతీయ మ్యూజియం 4,38,500 ఆస్ట్రేలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ.2 కోట్లు)కు సొంతం చేసుకుంది.
Sir Donald Bradman’s baggy green cap has sold for a record breaking $460,000.
It will also remain in Australia, Lloyd Auctions confirming the buyer plans to place it on public display in a prominent Australian museum. pic.twitter.com/hTk5LWq11q— Matthew Pantelis🎙 (@MatthewPantelis) January 26, 2026
ఈసారి.. ఆస్ట్రేలియా డే సందర్భంగా లాయిడ్స్ ఆక్షన్‌లో బ్రాడ్‌మన్ క్యాప్ 4,60,000 డాలర్లు అంటే రూ. 4 కోట్లు పలికింది. అపురూపమైన వస్తువులను సేకరించే ఒకాయన ఇంత మొత్తం పెట్టి.. ఈ టోపీని హస్తగతం చేసుకున్నారు. గతంలో మాదిరిగానే ఈ బ్యాగీ గ్రీన్ క్యాప్‌ను కూడా అభిమానుల సందర్శనార్ధం మ్యూజియంలో ఉంచనున్నారు.
What a catch – we just acquired an iconic piece of Aussie history! 🙌
This baggy green cap was worn by Sir Donald Bradman, our country’s most celebrated batsman, during the 1946-47 Ashes tour of Australia 🏏
The cap will be displayed in our Landmarks gallery. pic.twitter.com/xEia9Ii7Bn
— National Museum of Australia (@nma) August 29, 2025
భారత జట్టు, ఆస్ట్రేలియా 1947-48లో తలపడిన మ్యాచ్‌లో బ్రాడ్‌మన్ ఈ క్యాప్‌ను ధరించాడు. ఆ సమయంలోనే అతడు తన సహచరుడు ఎస్డబ్ల్యూ సొహోని(SW Sahoni)కి కానుకగా ఇచ్చాడు. 75 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ గ్రీన్ క్యాప్ వేలానికొచ్చింది. ప్రపంచ క్రికెట్లో ఓ వెలుగు వెలిగిన బ్రాడ్‌మన్ టెస్టుల్లో 99.94 బ్యాటింగ్ సగటుతో చరిత్ర సృష్టించాడు. 52 టెస్టుల్లో ఈ ఆస్ట్రేలియా స్టార్ 6,996 పరుగులు సాధించాడు. 1928 నుంచి 48 వరకూ ఇరవై ఏళ్లు తన ఆధిపత్యాన్ని కొనసాగించిన అతడు.. 29 సెంచరీలు, మూడు ట్రిపుల్ సెంచరీలు బాదాడు.