కోస్టా నోవారినో(గ్రీస్) : బాక్సింగ్ అభిమానులకు శుభవార్త! గత కొన్ని నెలలుగా అనిశ్చితి మధ్య సాగుతున్న అంతర్జాతీయ బాక్సింగ్ వివాదం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్(ఐబీఏ)ను పక్కకు తప్పిస్తూ వరల్డ్ బాక్సింగ్‌కు ఇప్పటికే ప్రాథమిక గుర్తింపునిచ్చిన ఐవోసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాస్ఎంజిల్స్(2028) ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌కు చోటు కల్పిస్తూ సోమవారం నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి మొదలయ్యే ఐవోసీ సెషన్‌కు ముందు బోర్డు..బాక్సింగ్ చేరికకు ఆమోదముద్ర వేసింది.