చండీగఢ్: ప్రముఖ బాక్సర్, మాజీ వరల్డ్ చాంపియన్ స్వీటీ బూర తన భర్త, కబడ్డీ ఆటగాడు దీపక్ హుడాపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. హుడాతో పాటు అత్తింటివారు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె హిసార్‌లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేసింది. భర్త నుంచి తనకు విడాకులు కావాలని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
2022లో ఈ ఇద్దరి వివాహం జరిగింది. పెండ్లి సమయంలో కోటి రూపాయల కట్నంతో పాటు ఖరీదైన కారు ఇచ్చినప్పటికీ మరింత కట్నం కోసం వేధిస్తూ భౌతిక దాడులకూ పాల్పడుతున్నారని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది.