బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Aug 10, 2020 , 19:11:55

బాక్సింగ్ కు సిద్ధమైన మైక్ టైసన్

బాక్సింగ్ కు సిద్ధమైన మైక్ టైసన్

మాజీ హెవీవెయిట్ బాక్సర్ మైక్ టైసన్ 15 ఏండ్ల తరువాత మరోసారి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. గత ఆరు నెలలుగా విరామం లేకుండా ఫిట్ నెస్ సాధించడంతోపాటు బాక్సింగ్ సాధన చేస్తున్నాడు. ఎలక్ట్రానిక్ మజిల్ స్టిమ్యులేషన్ (ఈఎంఎస్) విధానం ద్వారా శరీర పరివర్తన పొందుతున్నాడు. 54 ఏండ్ల వయసున్న మైక్ టైసన్.. ఈ ఈఎంఎస్ ద్వారా యువకుడిగా మారిపోయాడు. అంతా సవ్యంగా సాగితే మరో నాలుగు నెలల్లో రాయ్ జోన్స్ తో తలపడుతారు. తొలుత వీరి మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 12 న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ మ్యాచును వాయిదా వేసినట్లు తెలుస్తున్నది. అన్ని కలిసొస్తే వీరి మధ్య మ్యాచ్ నవంబర్ 28 న జరుగుతుంది.

అమెరికాలో నివసిస్తున్న మైక్ టైసన్ 20 సంవత్సరాల 4 నెలల 22 రోజుల వయసులో డబ్ల్యూబీసీ టైటిల్‌ను గెలుచుకుని వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. టైటిల్ గెలిచిన తరువాత టైసన్ కు 'ఐరన్ మ్యాన్' అని పేరు పెట్టారు. టైటిల్ గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. ఐర్లాండ్ బాక్సర్ కెవిన్ మెక్‌బ్రైడ్ చేతిలో ఓడిపోయిన టైసన్.. 2005 లో బాక్సింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. 15 సంవత్సరాల తరువాత ఇప్పుడు అతను మరోసారి తిరిగి రింగులోకి రావడానికి ఉవ్వీళ్లూరుతున్నాడు.


logo