హైదరాబాద్: సోషల్ మీడియాలో ఓ బౌలర్ వీడియో వైరల్ అవుతోంది. క్లబ్ మ్యాచ్ ఆడుతున్న స్పిన్నర్(Spin Bowler) చాలా వెరైటీగా బౌలింగ్ చేశాడు. అతను వేసిన బౌలింగ్ స్టయిల్.. అందరిలో నవ్వు తెప్పిస్తోంది. రెండు చేతుల్ని తిప్పుకుంటూ క్రీజ్ వద్దకు వస్తున్న ఆ బౌలర్‌ను చూస్తే .. ఇది బౌలింగేనా అన్నట్లు ఫీలవ్వడం ఖాయం. ఆ బౌలర్ తన వెరైటీ యాక్షన్‌తో క్రీజ్ వద్దకు రాగానే .. బ్యాటర్ తన పొజిషన్ నుంచి తప్పుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో ఆ బౌలర్ యాక్షన్‌పై కామెంట్లు ఫుల్‌గా వచ్చేస్తున్నాయి. స్విమ్మర్ కావాలనుకుంటే, తల్లితండ్రులు అతన్ని క్రికెట్లో చేర్పించారని ఓ యూజర్ కామెంట్ చేశాడు.
When you wanted to become a swimmer but parents forced you to join cricket#CricketTwitter pic.twitter.com/OMoRWOH0Tx
— Rajabets 🇮🇳👑 (@smileagainraja) November 23, 2023