చెన్నై: ఈ ఏడాది ఐపీఎల్‌కు వీడ్కోలు పలికి విదేశీ లీగ్‌ల్లో ఆడదామని భావించిన భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. డిసెంబర్ 14 నుంచి ఆస్ట్రేలియాలో మొదలుకాబోయే బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)కు ముందు చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్న అశ్విన్ మోకాలికి గాయమైంది.
గాయానికి శస్త్రచికిత్స అవసరమునున్న నేపథ్యంలో అతడు ఈ సీజన్ మొత్తానికి దూరమవుతానని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.