హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీ9 చాలెంజ్ గోల్ఫ్ నాలుగో సీజన్ టోర్నమెంట్లో బంకర్ బస్టర్స్, చాముండి బౌల్డర్‌హిల్స్ టైగర్స్ జట్లు సెమీఫైనల్ చేరుకున్నాయి. హైదరాబాద్ గోల్ఫర్ యునైటెడ్, దసోస్ బై మహీ జట్లు కూడా ముందంజ వేశాయి. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ గోల్ఫర్ యునైటెడ్ 3-1తో వీసాఫ్ట్ టైటాన్స్‌ను ఓడించగా.. బంకర్ బస్టర్స్ 5-2తో ఫెయిర్వే వారియర్స్‌పై విజయం సాధించింది. బౌల్డర్‌హిల్స్ టైగర్స్ జట్టు 4-0తో పార్ టైమర్స్‌ను క్లీన్‌స్వీప్ చేసి ముందంజ వేయగా..ఆఖరి క్వార్టర్స్ పోరులో దసోస్ బై మహీ 3-1తో ఐరన్ ఈగల్స్‌ను ఓడించి సెమీస్ బెర్తు సొంతం చేసుకుంది. సెమీస్‌లో బస్టర్స్‌తో గోల్ఫర్ యునైటెడ్, బౌల్డర్‌హిల్స్ టైగర్స్‌తో మహి జట్లు తలపడతాయి.