లండన్: జర్మనీ టెన్నిస్ దిగ్గజం బోరిస్ బెకర్ మూల్యం చెల్లించుకున్నాడు అధిక మొత్తంలో డబ్బులు బదలాయించడంతో పాటు ఆస్తులు దాచిపెట్టడం, బ్యాంక్ మోసాలకు పాల్పడిన కారణంగా బెకర్‌కు రెండున్నరేండ్ల జైలు శిక్ష పడింది. ఈనెల మొదట్లో బెకర్పై నాలుగు అభియోగాలు నమోదు కాగా కోర్టు సమగ్ర విచారణ అనంతరం శుక్రవారం శిక్ష ఖరారైంది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి దెబోరా టేలర్ తుది తీర్పు వెలువరించారు. తన కెరీర్లో ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన ఈ 54 ఏండ్ల జర్మనీ టెన్నిస్ ప్లేయర్ తన బిజినెస్ అకౌంట్ల నుంచి డాలర్ల కొద్ది డబ్బులను వేరే అకౌంట్లకు బదిలీ చేశాడు. దీనికి తోడు తన మాజీ భార్య బార్బరా, వేరుబడ్డ మరో భార్య షార్లె లిల్లీ అకౌంట్లను కూడా బెకెర్ దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలింది.
ఇదిలా ఉంటే జర్మనీలో ఉన్న తన ఆస్తులను ప్రకటించలేకపోవడంతో పాటు 8.71000(అమెరికా డాలర్ల) బ్యాంక్లోన్ను టెక్ కంపెనీలో పెట్టుబడిగా పెట్టాడు. మరోవైపు తన కెరీర్లో దక్కించుకున్న అవార్డులు, వింబుల్డన్ ట్రోఫీలు, ఒలింపిక్ గోల్డ్ మెడల్‌ను జప్తు చేసే విషయంలో బెకర్ అభియోగాలు ఎదుర్కొన్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్ లిలియన్ డీ కార్వాలోతో కలిసి కోర్టు విచారణకు హాజరైన బెకర్ తనపై ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నాడు.