Border -Gavaskar Trophy | భారత సిరీస్ నుంచి హేజిల్‌వుడ్ ఔట్.. మూడో టెస్టుకు గ్రీన్, స్టార్క్ ఫిట్..!
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మిగతా రెండు టెస్టులకు కూడా ఆస్ట్రేలియా స్టార్ పేసర్ హేజిల్‌వుడ్ దూరం కానున్నాడు. అషిల్లేస్ గాయం నుంచి అతను ఇంకా కోలుకోలేదు. దాంతో, స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు. అతనితో పాటు అష్టన్ అగర్, మ్యాట్ రెన్షా కూడా బయలుదేరనున్నారని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ వార్తా సంస్థ తెలిపింది. మార్చి 1న ఇండోర్‌లో మూడో టెస్టు జరగనుంది.
Border -Gavaskar Trophy : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టులు ఓడిపోయిన ఆస్ట్రేలియాకు షాక్. మిగతా రెండు టెస్టులకు కూడా ఆస్ట్రేలియా స్టార్ పేసర్ హేజిల్‌వుడ్ దూరం కానున్నాడు. గాయం కారణంగా అతను తొలి రెండు టెస్టులు ఆడలేదు. సిడ్నీ టెస్టులో అయిన అషిల్లేస్ గాయం నుంచి హేజిల్‌వుడ్ ఇంకా కోలుకోలేదు. దాంతో, అతను స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు. అతనితో పాటు ఓపెనర్ డేవిడ్ వార్నర్, అష్టన్ అగర్, మ్యాట్ రెన్షా కూడా బయలుదేరనున్నారని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ వార్తా సంస్థ తెలిపింది.
కుటుంబంలో ఒకరికి తీవ్రమైన ఆనారోగ్యం కారణంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా స్వదేశానికి వెళ్తున్నాడు. అతను మూడో టెస్టు సమయానికి ఇండియా రానున్నాడు. ఒకవేళ కమిన్స్ మార్చి 1 లోపు రాకుంటే స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రెండో టెస్టులో డేవిడ్ వార్నర్ కంకషన్‌గా పెవిలియన్ చేరాడు. బంతి బలంగా చేతికి తాకడంతో అతను మైదానం వీడాడు. అతని ప్లేస్‌లో ట్రావిస్ హెడ్ ఆడాడు.
గ్రీన్, స్కార్ట్ ఫిట్..!
గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు దూరమైన ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్, ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్కార్ట్ ఇండోర్ టెస్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే.. టెస్టు జట్టులో మార్పుల గురించి ఆసీస్ మేనేజ్మెంట్ బుధవారం అధికారికంగా వెల్లడించనుంది. ఢిల్లీ టెస్టులో భారత్ 6 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 10 వికెట్లతో ఆ జట్టు పతనాన్ని శాసించాడు. రెండో ఇన్నింగ్స్‌లో జడ్డూ 7 వికెట్లు తీయడంతో ఆసీస్ 113కే కుప్పకూలింది.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కి..
నాగ్‌పూర్ టెస్టులో ఇన్నింగ్స్ 132 రన్స్‌తో ఇండియా, ఆస్ట్రేలియాను ఓడించింది. దాంతో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉంది. అంతేకాదు.. ఈ ఏడాది వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు దిశగా ముందుడుగు వేసింది. ఇండోర్, అహ్మదాబాద్ టెస్టుల్లో ఏదో ఒకటి గెలిచినా కూడా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌లోని ఓవల్ స్టేడియంలో డబ్ల్యూటీసీ టైటిల్ పోరు జరగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

