AUSvsIND T20I: వాళ్లందరి కంటే బిష్ణోయ్ డిఫరెంట్ స్పిన్నర్.. పొట్టి వరల్డ్ కప్‌లో అతడుండాలిః లంక దిగ్గజం ప్రశంసలు
AUSvsIND T20I: సీనియర్ల గైర్హాజరీతో స్వదేశంలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యువ భారత జట్టులో చోటు దక్కించుకున్న ఈ రాజస్తాన్ కుర్రాడు.. ఐదు మ్యాచ్‌లలో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు.
AUSvsIND T20I: టీమిండియా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌పై లంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ప్రశంసలు కురిపించాడు. సీనియర్ల గైర్హాజరీతో స్వదేశంలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యువ భారత జట్టులో చోటు దక్కించుకున్న ఈ రాజస్తాన్ కుర్రాడు.. ఐదు మ్యాచ్‌లలో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. వచ్చే ఏడాదిలో అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్‌లో భారత్ అతడిని ఆడించాలని మురళీధరన్ తెలిపాడు.
మురళీధరన్ మాట్లాడుతూ.. భారత్‌లో తరానికి ఒక మంచి స్పిన్నర్ వస్తున్నాడు. అనిల్ కుంబ్లే నుంచి చూసుకుంటే అతడి తర్వాత రవిచంద్రన్ అశ్విన్ స్పిన్నర్‌గా రాణిస్తున్నాడు. ఇప్పుడు ఆ జాబితాలో బిష్ణోయ్ చేరాడు. ఇతర లెగ్ స్పిన్నర్లతో పోలిస్తే బిష్ణోయ్ కాస్త ప్రత్యేకం. అతడి బంతిని సంధించే శైలి భిన్నంగా ఉంటుంది. బిష్ణోయ్‌తో పాటు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కూడా బాగానే స్పిన్ రాబడుతున్నారు. వాషింగ్టన్ సుందర్ బంతిని పెద్దగా టర్న్ చేయలేకపోయినా కచ్చితత్వంతో బౌలింగ్ చేస్తున్నాడు.. అని అన్నాడు.
ఇప్పటికే భారత్ నుంచి కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ వంటి స్టార్ స్పిన్నర్లు ఉన్నా ఆస్ట్రేలియాతో సిరీస్‌లో రవి బిష్ణోయ్ రాణించడంతో వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో అతడు కూడా స్పిన్ విభాగంలో తీవ్ర పోటీనిస్తున్నాడు. ప్రధాన సిరీస్‌లకు ఎంపికవడం అతడికి ఇదే ప్రథమం. గతంలో ఐర్లాండ్, ఆసియా క్రీడలలోనే బిష్ణోయ్ కు అవకాశాలు దక్కాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

