న్యూఢిల్లీ: స్పిన్ మాంత్రికుడు, భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ (77) సోమవారం కన్నుమూశారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న బేడీ సోమవారం తుది శ్వాస విడిచారు. జాతీయ జట్టు తరఫున 67 టెస్టులు, 10 వన్డేలు ఆడిన బేడీ.. సుదీర్ఘ ఫార్మాట్లో 266 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.
1975 నుంచి 79 వరకు భారత టెస్టు కెప్టెన్‌గా సేవలందించిన బేడీ.. ఆ తర్వాత టీమ్ఇండియా మేనేజర్‌గా, జాతీయ సెలెక్టర్‌గా క్రికెట్‌కు ఎనలేని సేవ చేశారు. ఆయన మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తోపాటు పలువురు క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.