భారత్ తడబాటు బిల్లీజీన్ కింగ్ కప్
స్వదేశం వేదికగా థాయ్‌లాండ్‌తో జరుగుతున్న బిల్లీజీన్ కింగ్ కప్‌లో భారత్ 0-1తో వెనుకంజలో నిలిచింది. మంగళవారం మొదలైన టోర్నీలో ప్లేఆఫ్స్ బెర్తు లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోయింది.
న్యూఢిల్లీ : స్వదేశం వేదికగా థాయ్‌లాండ్‌తో జరుగుతున్న బిల్లీజీన్ కింగ్ కప్‌లో భారత్ 0-1తో వెనుకంజలో నిలిచింది. మంగళవారం మొదలైన టోర్నీలో ప్లేఆఫ్స్ బెర్తు లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోయింది. వర్షం కారణంగా దాదాపు మూడు గంటలకు పైగా ఆలస్యంగా మొదలైన పోరులో భారత యువ ప్లేయర్ వైష్ణవి అద్కార్ 1-6, 3-6తో అంచిసా చాంటా చేతిలో ఓటమిపాలైంది.
ఇక్కడి డీఎల్టీఏ సెంటర్ కోర్టులో గంటా 13 నిమిషాల పాటు సాగిన పోరులో వైష్ణవి అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. ప్రత్యర్థి ప్లేయర్ కంటే 73 స్థానాలకు మించి 383 ర్యాంక్‌లో ఉన్న వైష్ణవి సరైన పోటీనివ్వడంలో విఫలమైంది. తొలి సెట్‌ను 1-6తో చేజార్చుకున్న వైష్ణవి..రెండో సెట్లోనూ పుంజుకోలేకపోయింది. మరో సింగిల్స్‌లో సహజ యమ్లపల్లి 4-6, 6-1, 3-4తో పత్చరిన్తో మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయింది. బుధవారం ఈ ఇద్దరి మధ్య మిగిలిన పోరు కొనసాగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

