హైదరాబాద్, ఆట ప్రతినిధి: గుజరాత్ వేదికగా జరుగుతున్న 36వ జాతీయ క్రీడల్లో తెలంగాణ నెట్‌బాల్ జట్టు దుమ్మురేపింది. బుధవారం జరిగిన పురుషుల నెట్‌బాల్ క్వార్టర్స్‌లో తెలంగాణ 101-46 తేడాతో బిహార్‌పై ఘన విజయం సాధించింది.
ఆద్యంతం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన తెలంగాణ భారీ స్కోరు నమోదు చేసింది. తద్వారా నేషనల్ గేమ్స్‌లో అత్యధిక స్కోరు అందుకున్న జట్టుగా కొత్త రికార్డు నెలకొల్పింది. గురువారం జరిగే సెమీస్‌లో తెలంగాణ..గుజరాత్‌తో తలపడుతుంది.