IPL 2023 : ఢిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్(Gujarat Titans)కు బిగ్ షాక్ తగిలింది. కేన్ విలియమ్సన్(Kane Williamson) టోర్నీ మొత్తానికి దూరం అయ్యాడు. 16వ సీజన్ ఆరంభ పోరులో గాయపడిన అతను స్వదేశానికి పయనమయ్యాడు. కుడి మోకాలికి పట్టీతో, రెండు కర్రల సాయంతో నిల్చొని ఉన్న తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘థాంక్యూ గుజరాత్ టైటన్స్. గత రెండు రోజులుగా నాకు
అన్నివిధాలా సపోర్ట్ చేసిన మంచి మనుషులకు థాంక్స్. కాలి గాయం నుంచి కోలుకునేందుకు స్వదేశం బయలుదేరుతున్నాను’ అని క్యాష్షన్ రాశాడు. ఆ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ విలియమ్సన్ తొందరగా కోలుకో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా ఈ కివీస్ బ్యాటర్ గాయపడ్డాడు. రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన బంతిని బౌండరీ వద్ద ఎగిరి ఆపేందుకు ప్రయత్నించి కింద పడ్డాడు. అతనంతరంనొప్పితో విలవిలలాడుతూ మైదానం వీడాడు. స్కానింగ్‌లో అతని కుడిమోకాలు బెణికినట్టు గుర్తించారు. దాంతో, న్యూజిలాండ్ క్రికెట్(NZ) తమ స్టార్ ప్లేయర్‌ను స్వదేశానికి రావాలని కోరింది. న్యూజిలాండ్ క్రికెట్ వైద్య బృందం అతని గాయం తీవ్రతను పరిశీలించి చికిత్స్ చేయనుంది. చెన్నైపై గుజరాత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ ధాటిగా ఆడడడంతో ఆఖరి ఓవర్లో పాండ్యా సేన విజయం సాధించింది.