Team India | మళ్లీ టీం ఇండియా జట్టులో బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు చోటు దగ్గడం అనుమానమేనని లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. ఆయన ప్రస్తుత ఫామ్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రెండు ప్రపంచ కప్‌లకు బీసీసీఐ.. క్వాలిటీ గల ప్లేయర్లను వెలికి తీయాల్సిన అవసరం ఉందని సూచించాడు. తక్కువ టైం ఉన్నందున టీ-20, వన్డే ఫార్మాట్లలో సత్తా చాటే సామర్థ్యం గల క్రికెటర్లను సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో టీ-20, 2023 అక్టోబర్‌లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం అవుతాయి. ఇక వన్డే వరల్డ్ కప్ టోర్నీ సొంత గడ్డపైనే జరుగనున్నది. కనుక సహజంగానే టీం ఇండియాపై భారీ ఆశలు.. అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు అనుగుణంగా ఆడాలంటే క్లిష్ట పరిస్థితుల్లోనూ సత్తా చాటగల క్రికెటర్లను ఎంపిక చేయాలని సునీల్ గవాస్కర్ సూచించాడు.
ఇప్పుడు యువ బౌలర్ల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుందని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. భువనేశ్వర్ బౌలింగ్‌లో ఇంతకుముందు పదును, ఖచ్చితత్వం కనిపించడం లేదన్నాడు. గతంలో టీంఇండియాకు ఆయన సేవనుల తక్కువ అంచనా వేయలేం కానీ.. కొద్ది కాలంగా ఫామ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని అన్నాడు. అవకాశం ఉన్న మ్యాచ్‌ల్లోనూ భారీగా పరుగులు సమర్పించుకోవడం ఇబ్బందికరంగా ఉంటుందన్నాడు.
ప్రత్యర్థి ప్లేయర్లు.. భువనేశ్వర్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నందున కొంతకాలం విశ్రాంతి తీసుకుని బౌలింగ్‌పై దృష్టి పెడితే బాగుంటుందన్నాడు సునీల్ గవాస్కర్. ఇప్పటికైతే భువనేశ్వర్‌కు ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సిన టైం ఆసన్నమైందని భావిస్తున్నానన్నాడు. దీపక్ చాహర్‌కు అవకాశాలిచ్చి మెరుగైన బౌలర్‌గా తీర్చిదిద్దాలని సూచించాడు.