Bhavani devi wins France Fencing Competetion | టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఫెన్సింగ్‌లో పోటీ పడి చరిత్ర సృష్టించిన ఫెన్సర్ భవానీ దేవి మరో అరుదైన ఘనత సాధించింది. ఫ్రాన్స్‌లో జరిగిన చార్లెల్విల్లె నేషనల్ కాంపిటీషన్లో వ్యక్తిగత సేబర్ విభాగంలో విజేతగా నిలిచింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆమె స్వయంగా వెల్లడించింది.
‘‘ఇండివిడ్యువల్ సేబర్ విభాగంలో ఛార్లెల్విల్లె నేషనల్ కాంపిటీషన్ గెలిచాను. కోచ్‌లు క్రిస్టియర్ బార్, ఆర్నాడ్ ష్నైడర్ ఇతర టీమ్‌మేట్స్‌కు ధన్యవాదాలు. సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించిన అందరికీ శుభాకాంక్షలు’’ అని 28 ఏళ్ల ఈ ఫెన్సర్ ట్వీట్ చేసింది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్త ఫెన్సర్ ర్యాంకింగ్స్‌లో భవానీ దేవి 50వ స్థానంలో ఉంది. 2022 ఏషియన్ గేమ్స్‌లో రాణించాలని ఆమె కృషిచేస్తోంది. దానికోసం ఇప్పటి నుంచే శ్రమిస్తోంది.
Won the Charlellville National Competition, France in the Women's Sabre individual.
— C A Bhavani Devi (@IamBhavaniDevi) October 17, 2021
Many thanks to coach Christian Bauer, Arnaud Schneider ,and all teammates
Congratulations to all for a great start of the season. pic.twitter.com/C0dflvOtlZ