లక్నో: 2026 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ తన కోచింగ్ బృందంలో మార్పులు చేసింది. బౌలింగ్ కోచ్‌గా భారత క్రికెట్ జట్టుకు గతంలో సేవలందించిన భరత్ అరుణ్‌ను నియమించుకుంది. గత సీజన్లో జహీర్‌ఖాన్‌ను మెంటార్‌గా తీసుకున్న లక్నో.. 2026లో అతడికి గుడ్‌బై చెప్పనున్నట్టు సమాచారం. అలాగే హెడ్‌కోచ్ జస్టిన్ లంగర్ స్థానంపైనా సందిగ్ధత కొనసాగుతున్నది.