భారత అండర్-19 జట్టుకు ఎంపిక
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న యంగ్ క్రికెటర్ గొంగడి త్రిషకు తొలిసారి భారత అండర్-19 జట్టులో చోటు దక్కింది. న్యూజిలాండ్‌తో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆల్ఇండియా మహిళల సెలెక్షన్ కమిటీ ఆదివారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించగా.. అందులో తెలంగాణ ఆల్‌రౌండర్ త్రిష చోటు దక్కించుకుంది. ఈ నెల 27 నుంచి డిసెంబర్ 6 వరకు భారత అమ్మాయిల జట్టు న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ జట్టుకు శ్వేత షెరావత్ సారథ్యం వహిస్తుండగా.. మ్యాచ్‌లన్నీ ముంబైలోనే జరుగనున్నాయి. ఇటీవల వైజాగ్ వేదికగా ముగిసిన చాలెంజర్ టోర్నీలో దుమ్మురేపిన పదహారేండ్ల త్రిష.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ రాణించి.. అండర్-19 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడమే తన లక్ష్యమని చెప్పింది.