BFI : ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్‌లో భారత షూటర్ల స్ఫూర్తితో బాక్సర్లు(Boxers) ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024) బెర్తుపై గురి పెట్టనున్నారు. ఫిబ్రవరిలో ఇటలీలో జరుగబోయే మొదటి వరల్డ్ క్యాలిఫికేషన్ టోర్నమెంట్ (World Qualification Tournament)లో తొమ్మది మంది బాక్సర్లు పంచ్ పవర్ చూపించేందుకు సిద్ధమవతున్నారు. ఈ టోర్నీ కోసం సోమవారం భారత బాక్సింగ్ సమాఖ్య(BFI) 9 మందితో కూడిన బృందాన్ని ప్రకటించింది.
ఆరుసార్లు ఆసియా చాంపియన్‌షిప్ మెడలిస్ట్ శివ థాపా(Shiva Thapa), కామన్వెల్త్లో కంచు మోత మోగించిన జైస్మిన్ లంబోరియా(Jaismine Lamboria)లు ఈ లిస్ట్‌లో ఉన్నారు. వీళ్లతో పాటు అంకుశిత బొరో(66 కిలోలు), నేషనల్ చాంపియన్ లక్ష్య చాహర్(80 కిలోలు), సంజీత్ కుమార్(92 కిలోలు), నరేందర్ బెర్వాల్(92 ప్లస్ కేజీ), మహ్మద్ హుసాముద్దీన్(57 కిలోలు), దీపక్ భోరియా(51 కేజీ), నిషాంత్ దేవ్(71 కేజీ)లు చోటు దక్కించుకున్నారు. థాపా 63.3 కిలోల విభాగంలో, లంబోరియా 60 కిలోల విభాగంలో పోటీపడనున్నారు. ఇటలీలోని బస్టో అర్సీజియోలో ఫిబ్రవరి 29 నుంచి మార్చి 12 వరకూ ఈ టోర్నీ జరుగనుంది.
Our boxers begin their journey to Paris 🇫🇷
Here’s the squad for the First World Olympic Qualifiers 🥊🔥#PunchMeinHaiDum #Boxing#Olympics#RoadToParis pic.twitter.com/yl4neZFGAs
— Boxing Federation (@BFI_official) January 22, 2024
మొదటి వరల్డ్ క్యాలిఫికేషన్ టోర్నమెంట్లో మొత్తం 55 ఒలింపిక్స్ బెర్తులు ఉన్నాయి. మహిళా బాక్సర్లకు 22 స్థానాలను కేటాయించారు. అనంతరం బ్యాంకాక్‌లో జరుగబోయే రెండో వరల్డ్ క్యాలిఫికేషన్ టోర్నమెంట్‌తో మరో 51 మంది బాక్సర్లు క్వాలిఫై కానున్నారు. ఇప్పటికే నిఖత్ జరీన్(50 కిలోలు), ప్రీతి(54 కిలోలు), ప్రవీణ్ హుడా(57 కిలోలు), లవ్లీనా బొర్గొహెన్(75 కిలోలు)లు విశ్వ క్రీడలకు అర్హత సాధించారు.