IND vs ENG | చితక్కొట్టిన బెథెల్.. రెండో టీ20లో చిత్తుగా ఓడిన టీమిండియా..!
IND vs ENG : మాంచెస్టర్‌లో ఇంగ్లండ్ యువకెరటం జాకబ్ బెథెల్(76 నాటౌట్) చితక్కొట్టాడు. భారత బౌలర్లను బెంబేలెత్తించిన ఈ చిచ్చరపిడుగు మెరుపు అర్ధ శతకంతో ఇంగ్లండ్‌ను గెలిపించాడు.
IND vs ENG : మాంచెస్టర్‌లో ఇంగ్లండ్ యువకెరటం జాకబ్ బెథెల్(76 నాటౌట్) చితక్కొట్టాడు. భారత బౌలర్లను బెంబేలెత్తించిన ఈ చిచ్చరపిడుగు మెరుపు అర్ధ శతకంతో ఇంగ్లండ్‌ను గెలిపించాడు. 191 పరుగుల ఛేదనలో అర్ష్‌దీప్ సింగ్(3-40) తొలి ఓవర్లోనే రెండు వికెట్లతో భయపెట్టినా.. బెథెల్ బెదరలేదు. హ్యారీ బ్రూక్(32), టామ్ బ్యాంటన్(39)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అతడి తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా రెండో టీ20లో భారత జట్టు చిత్తుగా ఓడింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య జట్టు 1-0తో ముందంజ వేసింది.
ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనను ఓటమితో ప్రారంభించింది. 191 పరుగుల భారీ ఛేదనలో తొలి ఓవర్లోనే అర్ష్‌దీప్ సింగ్(3-40) ఇంగ్లండ్ ఓపెనర్లను పెవిలియన్ చేర్చారు. ఫిల్ సాల్ట్(0) తొలి బంతికే ఔటవ్వగా.. జోస బట్లర్(0) అతడిని అనుసరించాడు. ఆ తర్వాత కెప్టెన్ హ్యారీ బ్రూక్ (39), జాకబ్ బెథెల్(76 నాటౌట్) బౌండరీలతో చెలరేగారు. వీరిద్దరూ 23 బంతుల్లోనే 50 రన్స్ జోడించి భయపెట్టారు. అయితే.. అక్షర్ పటేల్ బౌలింగ్లోలెగ్ సైడ్ ఆడబోయిన బ్రూక్ వికెట్ కీపర్ ఇషాన్ చేతికి చిక్కాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వగా రివ్యూతో అతడి వికెట్ సాధించింది భారత్.
Jacob Bethell smashed an unbeaten 76 to take England over the line as they secured a 1-0 lead.#JacobBethell #ENGvsINDpic.twitter.com/SKGz7VS68r
— CREX (@Crex_live) July 4, 2026
53 వద్దే మూడో వికెట్ పడినా టామ్ బ్యాటన్(39) జతగా బెథెల్ దంచాడు. వరుణ్ ఓవర్లో 6, 4 కొట్టగా 10 ఓవర్లకు ఇంగ్లండ్ 91 రన్స్ చేసింది. రెండో స్పెల్‌లో బంతి అందుకున్న అర్ష్‌దీప్ ఆతిథ్య జట్టుకు షాకిస్తూ బ్యాంటన్ను వెనక్కి పంపాడు. కానీ, బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్లో రెచ్చిపోయిన బెథెల్.. మూడు సిక్సర్లు, ఫోర్‌తో 27 రన్స్ పిండుకున్నాడు. అంతే.. మ్యాచ్ ఇంగ్లండ్ వైపు మళ్లింది. విజయానికి 14 బంతుల్లో 12 రన్స్ అవసరమైన వేళ విల్ జాక్స్(7) ఔటైనా.. అర్చర్ అండగా లాంఛనం ముగించాడీ హిట్టర్.
England take a 1-0 series lead with three games left 🏴 pic.twitter.com/fd5Cn4Fnt1
— Cricinfo (@cricinfo) July 4, 2026
ఇషాన్, అభిషేక్ మెరవగా..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు శుభారంభమిచ్చారు. అభిషేక్ శర్మ(43), వైభవ్ సూర్యవంశీ(14)లు దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించి తొలి వికెట్‌కు 50 రన్స్ జోడించారు. అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన వైభవ్.. జోఫ్రా ఆర్చర్ తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. అనంతరం టంగ్‌కు సిక్సర్ రుచి చూపాడు. కానీ, విల్ జాక్స్ ఓవర్లో ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌటయ్యాడు. దాంతో, అరంగేట్రం మ్యాచ్‌లో ఔటైన తొలి భారత ఆటగాడిగా మరో రికార్డు నెలకొల్పాడు.
అభిషేక్ శర్మ(43), ఇషాన్ కిషన్(49)

కాసేపటికే సామ్ కరన్ ఓవర్లో అభిషేక్ వెనుదిరిగాడు. ఓపెనర్లు విఫలమైనా ఇషాన్ కిషన్(49), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(37)లు వేగంగా ఆడారు. మూడో వికెట్‌కు 65 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని డాసన్ విడదీశాడు. శివం దూబే(5) నిరాశపరచగా.. చివరి ఓవర్లో తిలక్ వర్మ(24 నాటౌట్) 6, 6, 4 కొట్టాడు. దాంతో, భారత్ 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ప్రజల వద్దకే పాలన కోసం జిల్లాలు ఏర్పాటు : గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
Wife Stabs Husband’s Private Part | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో భార్య దాడి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

