PM Modi: ప్రధాని మోదీని కలిసిన శరద్ పవార్, సుప్రియా సూలే
PM Modi: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్, ఆయన కుమార్తె, ఎంపీ సుప్రీయా సూలే ఇవాళ ప్రధాని మోదీని కలిశారు. ఆ భేటీకి చెందిన ఫోటోలను రిలీజ్ చేశారు. ఎన్డీఏ కూటమికి ఎన్సీపీ మద్దతు ఇస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్, ఆయన కుమార్తె ఎంపీ సుప్రీయా సూలే ఇవాళ ప్రధాని మోదీ(PM Modi)ని కలిశారు. ఆ భేటీకి చెందిన ఫోటోలను పీఎంవోలో రిలీజ్ చేశారు. మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్.. ప్రధాని మోదీని కలిసి మాట్లాడిన అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎన్డీఏ కూటమికి ఎన్సీపీ మద్దతు ఇస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరూ కాసేపు సరదాగా నవ్వుతూ మాట్లాడుకున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నియోజకవర్గాల పునర్ విభజన బిల్లును మరోసారి ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తున్నది. దీని కోసం ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలిస్తోంది.
మూడో వంతు మెజారిటీ కోసం మోదీ ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది. ఎన్సీపీ వద్ద 8 మంది ఎంపీలు ఉన్నారు. అయితే ఒకవేళ డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్ ప్రవేశపెడితే, అప్పుడు ఎన్సీపీ మద్దతు అవసరం వస్తుందని తాజా భేటీ ద్వారా స్పష్టం అవుతోంది. 50 శాతం సీట్లను పెంచుతామని రాతపూర్వకంగా ప్రభుత్వం హామీ ఇస్తే అప్పుడు డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తామని ఇటీవల ఎన్సీపీ పేర్కొన్న విషయం తెలిసిందే. మరో వైపు ఎన్డీఏ కూటమిలో శరద్ పవార్ పార్టీ చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
Rajya Sabha MP Shri @PawarSpeaks Ji and Lok Sabha MP Smt. @supriya_sule Ji called on PM @narendramodi in Parliament earlier today. pic.twitter.com/DwTspUA0th
— PMO India (@PMOIndia) July 22, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- NCP
- NDA
- Pm Modi
- Sharad Pawar
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

